te_tw/bible/other/possess.md

6.9 KiB
Raw Permalink Blame History

స్వాధీనము చేసుకొను, స్వాధీనముగా ఉండే, స్వాధీనము, అస్వాదీనం చెయ్యడం

వాస్తవాలు:

“స్వాధీనము” మరియు “స్వాధీనము చేసికొనుట” అనే పదములు సాధారణముగా దేనినైనా స్వంతము చేసికొనుటను సూచిస్తుంది. భూమిని స్వాధీనము చేసుకొనుటను లేక దేని మీదనైనా నియంత్రణ పొందుట అను అర్థములు ఈ పదాలకు కలవు.

  • పాత నిబంధనలో ఒక భూమిని “స్వాధీనపరచుకొనుటను” లేక “వశము చేసుకొనుటను” అనే సందర్భములో ఈ పదము ఎక్కువగా ఉపయోగించబడింది.
  • కానాను దేశమును “స్వాధీనము” చేసికొనుమని యెహోవ ఇశ్రాయేలీయులకు ఆదేశించినప్పుడు, వారు కానాను దేశములోనికి వెళ్లి, అక్కడ నివాసించాలని ఆ మాటకు అర్థమునైయున్నది. ఆ దేశమందు నివసించిన కానాను ప్రజలను మొట్ట మొదటిసారిగా జయించడమును ఇందులో ఇమిడియుంటుంది.
  • “వారి స్వాస్థ్యముగా” కానాను దేశమును దేవుడు వారికి ఇచ్చాడని ఆయన ఇశ్రాయెలీయులకు చెప్పెను. ఈ పదమును “నివసించుటకు వారికి సరియైన స్థలము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఇశ్రాయేలు జనమును కూడా యెహోవ యొక్క “ప్రత్యేకమైన స్వాస్థ్యము” అని కూడా పిలువబడిరి. ఆయనను సేవించుటకు మరియు ఆరాధించుటకు విశేషముగా పిలువబడిన తన ప్రజలుగాను మరియు ఆయనకు సంబంధించిన ప్రజలుగా వారు ఉందురని దీని అర్థమునైయున్నది.

అనువాదం సూచనలు:

  • “స్వాధీనము” అనే పదమును “స్వంతం” లేక “కలిగియుండు” లేక “ దేని మీదనైనా అధికారము కలిగియుండు” అని అనువాదం చేయవచ్చును.
  • “వాటిని స్వాధీనపరచుకొనుడి” అనే మాటను “వాటిని నియంత్రణలోనికి తీసుకొనండి” లేక “వశము చేసుకొనండి” లేక “ఆ స్థలములో నివసించండి” అని సందర్భానుసారముగా అనువాదం చేయవచ్చును.
  • ప్రజలు స్వంతము చేసికొనిన వస్తువులను గూర్చి సూచించినప్పుడు, “స్వాస్థ్యములు” అనే పదమును “సంబంధించినవి” లేక “ఆస్తి” లేక “స్వంత వస్తువులు” లేక “వారు స్వంతము చేసికొనిన వస్తువులు” అని తర్జుమా చేయవచ్చును.
  • యెహోవా ఇశ్రాయేలీయులను పిలిచినప్పుడు, “నా ప్రత్యేకమైన స్వాస్థ్యము” అనే ఈ మాటను “నా ప్రత్యేకమైన ప్రజలు” లేక “నాకు సంబంధించిన ప్రజలు” లేక “నేను ప్రేమించే, పరిపాలించే నా ప్రజలు” అని కూడా అనువాదం చేయవచ్చును.
  • “వారు వారి స్వాస్థ్యముగా మార్చబడుతారు” అనే వాక్యము భూమిని సూచించి చెప్పినప్పుడు, ఈ మాటకు “వారు ఆ భూమిని వశము చేసికొందురు” లేక “ఆ భూమి వారికి చెందుతుంది” అని అర్థము.
  • “ఆయన స్వాస్థ్యములో కనుగొనబడినది” అనే ఈ మాటను “తాను పట్టుకొనినదానియందు” లేక “అతనితో కలిగియున్నవాటితో” అని కూడా అనువాదం చేయవచ్చును.
  • “మీ స్వాస్థ్యమువలె” అనే ఈ మాటను “మీకు సంబంధించిన వాటివలె” లేక “నీ ప్రజలు నివసించు స్థలమువలె” అని కూడా అనువాదం చేయవచ్చును.
  • “ఆయన స్వాస్థ్యములో” అనే ఈ మాటను “ఆయన స్వంతము చేసికొనిన దానియందు” లేక “ఆయనకు సంబంధించినది” అని కూడా అనువాదం చేయవచ్చును.

(ఈ పదములను కూడా చుడండి: Canaan, worship, inherit)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0270, H0272, H0834, H2505, H2631, H3027, H3423, H3424, H3425, H3426, H4180, H4181, H4672, H4735, H4736, H5157, H5159, H5459, H7069, G11390, G21920, G26970, G27220, G29320, G29330, G29350, G40470, G52240, G55640