te_tw/bible/other/melt.md

3.4 KiB

కరుగుట, కరిగింది, కరుగుతుంది, కరుగుతూఉంది, కరిగిపోయింది

వాస్తవాలు:

“కరగడం” అనే పదం దేనినైనా వేడిచేసినప్పుడు అది ద్రవంగా మారడాన్ని సూచిస్తుంది. ఇది రూపకాలంకారంగా కూడా నినియోగించబడుతుంది. ఏదైనా కరిగించబడినప్పుడు అది “కరిగిపోయింది” అని వివరించబడుతుంది.

  • వివిధరకాలైన లోహాలు కరిగిపోయంతగా వేడిచెయ్యబడతాయి, ఆయుధాలు లేక విగ్రాహాలుగా తయారవడానికి అవి అచ్చులుగా పోయబడతాయి. “కరిగిపోయిన లోహం” అంటే కరిగించిన లోహం అని అర్థం.
  • కొవ్వొత్తి కాలిపోయినప్పుడు దాని మైనం కరిగిపోతుంది, జారిపోతుంది. పురాతన కాలాలలో, ఉత్తరాల మీద మైనాన్ని కరిగించి దాని అంచులమీద పోయడం ద్వారా వాటికి ముద్ర వేస్తారు.
  • ”కరిగిపోవడం” అంటే ఉపమానరీతిగా “కరిగిపోవడం” అంటే మెత్తగానూ, బలహీనంగానూ, మైనం కరిగిపోయినట్లు కావడం అని అర్థం.
  • వారి హృదయాలు కరిగిపోయాయి” అంటే వారు భయం కారణంగా చాలా బలహీనులు అయ్యారు అని అర్థం.
  • ఉపమానాలంకారంగా ”వారు కరిగిపోయారు” అంటే వారు వెల్లిపోయేలా బలవంతం చెయ్యబడ్డారు, లేక వారు బలహీనులుగా కనిపించారు, ఓటమితో వెళ్ళిపోయారు అని అర్థం.
  • ”కరిగిపోవడం” అంటే అక్షరాలా, “నీరుకారిపోయారు” లేక “నీరయ్యారు” లేక “నీరులా తయారయ్యారు” అని అర్థం.
  • ”కరిగిపోవడం” పదాన్ని ఉపమానంగా అనువదించడంలో “మృదువుగా మారడం” లేక “బలహీనంగా మారడం” లేక “ఓడిపోవడం” పదాలు ఉన్నాయి.

(చూడండి: హృదయం, అబద్దపు దేవుడు, స్వరూపం, ముద్ర)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1811, H2003, H2046, H3988, H4127, H4529, H4541, H4549, H5140, H5258, H5413, H6884, H8557, G3089, G5080