te_tw/bible/other/learnedmen.md

2.7 KiB

జ్ఞానులు (పండితులు), జ్యోతిష్యులు

నిర్వచనం:

మత్తయి సువార్తలోని క్రీస్తు జనన వృత్తాంతంలో “చదువుకున్నవారు” లేక “పండితులు” ఆయన పుట్టిన తరువాత కొద్దికాలానికి బెత్లేహెంలో ఉన్నా యేసుకు బహుమతులు తీసుకొనివచ్చిన “జ్ఞానులు.” నక్షత్రాలను అధ్యయనం చేసే “జ్యోతిష్యులు” ఉండి ఉంటారు.

  • ఇశ్రాయేలుకు తూర్పున చాలా దూరంలో ఉన్న ఒక దేశంనుండి వీరు ప్రయాణం చేసి వచ్చారు. వారు ఎక్కడినుండి వచ్చారో, వారు ఎవరో ఖచ్చితంగా తెలియదు. అయితే వారు ఖచ్చితంగా పండితులు, నక్షత్రాలను గురించి అధ్యయనం చేసారు.
  • దానియేలు కాలంలో బబులోను రాజులకు సేవచేసిన వారి సంతానం అయియుండవచ్చు. వారు అనేకమైన వాటిలో తర్ఫీదు పొందినవారు, నక్షత్రాల అధ్యయనం, కలలకు అర్థం చెప్పడంలో కూడా తర్ఫీదు పొందారు.
  • సాంప్రదాయంగా వారు ముగ్గురు జ్ఞానులు, పండితులైన వ్యక్తులు అని చెపుతున్నారు, ఎందుకంటే వారు యేసుకు మూడు బహుమతులు తీసుకొనివచ్చారు. అయితే వారు ఎంతమంది అని బైబిలు చెప్పడం లేదు.

(చూడండి: బాబులోను, బెత్లెహెం, దానియేలు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1505, G3097