te_tw/bible/other/horn.md

2.9 KiB
Raw Permalink Blame History

కొమ్ము, కొమ్ములు, కొమ్ములున్న

వాస్తవాలు:

కొమ్ములు గట్టి పదార్థంతో తలపై ఎదుగుతూ ఉండేవి. పశువులు, గొర్రె, మేకలు, జింక ఇంకా అనేక జంతువులకు కొమ్ములు ఉంటాయి.

  • పొట్టేలు (మగ గొర్రె) కొమ్ముతో చేసిన సంగీత వాయిద్యాన్ని "పొట్టేలు కొమ్ము” లేక “షోఫర్" అంటారు. పండుగలు తదితర ప్రత్యేకసమయాల్లో దీన్ని ఊదుతారు.
  • కొమ్ముల వంటి వాటిని సాంబ్రాణి వేసే వేదిక, ఇత్తడి బలిపీఠం నాలుగు మూలలా చెయ్యమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. వీటిని "కొమ్ములు," అని పిలిచినప్పటికీ అవి జంతువు కొమ్ములు కాదు.
  • "కొమ్ము" అనే దాన్ని కొన్ని సార్లు కొమ్ము ఆకారంలో ఉన్న గిన్నె లాటి దానికి ఉపయోగిస్తారు. ఇందులో నీరు లేక నూనె ఉంచుతారు. రాజులకు అభిషేకం చెయ్యడానికి దీన్ని ఉపయోగిస్తారు. సమూయేలు దావీదుకు ఇలానే అభిషేకం చేశాడు.
  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. బాకా.
  • "కొమ్ము" ను అలంకారికంగా బలం, శక్తి, అధికారం, రాజ సంబంధమైన ఘనతకు సంకేతంగా ఉపయోగిస్తారు.

(చూడండి: అధికారం, ఆవు, జింక, మేక, శక్తి, రాజ సంబంధమైన, గొర్రె, బాకా)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3104, H7160, H7161, H7162, H7782, G27680