te_tw/bible/other/creation.md

5.1 KiB
Raw Permalink Blame History

సృష్టించు౦, సృష్టించబడిన, సృష్టి, సృష్టికర్త

నిర్వచనం:

ఈ పదం "సృష్టించు" అంటే దేన్నైనా చేయడం. దేన్నైనా ఉండేలా చేయడం. సృష్టించబడినది ఏదైనా "సృష్టి" అంటారు. దేవుణ్ణి "సృష్టికర్త" అన్నారు. ఎందుకంటే అయన ప్రతిదాన్నీ విశ్వం అంతటినీ ఉనికి లోకి తెచ్చాడు.

  • దేవుడు లోకాన్ని సృష్టించడంలో ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు అయన శూన్యంలోనుండి దాన్ని చేశాడని అర్థం.
  • మానవులు దేన్నైనా "సృష్టి చేస్తే" వారు ఇప్పటికే ఉనికిలో ఉన్న వస్తువులతో చేస్తారు.
  • కొన్ని సార్లు "సృష్టించు" అనే పదాన్ని దేన్నైనా నైరూప్య అంశాన్ని అలంకారికంగా వర్ణించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు సృష్టించడం శాంతిని, లేక ఎవరిలోనైనా శుద్ధ హృదయాన్ని సృష్టించడం చెప్పడానికి వాడతారు.
  • ఈ పదం "సృష్టి"ని లోకం ఆరంభస్థితిని, అంటే దేవుడు మొదటి సృష్టిని చేసిన కాలాన్ని చెప్పడం కోసం వాడతారు. సాధారణంగా దేవుడు చేసిన ప్రతిదాన్నీ చెప్పడంకోసం ఇది ఉపయోగిస్తారు. కొన్ని సార్లు ఈ పదం "సృష్టి" ఇదమిద్ధంగా లోకంలోని మనుషుల కోసం మాత్రమే వాడతారు.

అనువాదం సూచనలు:

  • కొన్ని భాషల్లో దేవుడు లోకాన్నిశూన్యంలోనుంచి సృష్టించిన సంగతి స్పష్టంగా నేరుగా చెప్పే పదాలు ఉండవచ్చు.
  • "లోకం సృష్టి మొదలు నుండి" పదబంధం అంటే, "దేవుడు లోకాన్ని సృష్టించిన నాటి నుండి." అని అర్థం.
  • ఇలాటిదే మరొక పద బంధం, "సృష్టి ఆరంభం" అనే దాన్ని "ఆదిలో దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు” లేక “లోకం మొదట సృష్టించబడినప్పుడు." అని అనువదించవచ్చు.
  • "సృష్టి అంతటికీ సువార్తను ప్రకటించడం” అంటే సువార్తను "భూమిపై అన్ని చోట్లా ప్రజలందరికీ" ప్రకటించడం అని అర్థం.
  • పద బంధం "సృష్టి ఆనందించాలి" అనే పదబంధం అంటే " దేవుడు సృష్టించిన ప్రతిదీ ఆనందించాలి" అని అర్థం.
  • సందర్భాన్ని బట్టి, "సృష్టించు" అనే దానిని "చెయ్యడం” లేక “కలిగించడం” లేక “శూన్యంలోనించి తయారు చెయ్యడం" అనువదించవచ్చు.
  • ఈ పదం" సృష్టికర్త" అనే దాన్ని ప్రతిదాన్నీ సృష్టించిన వాడు.” లేక “లోకమంతటిని చేసిన దేవుడు" అని అనువదించవచ్చు.
  • "నీ సృష్టికర్త" అనే పదాలను "నిన్ను చేసిన దేవుడు" అని అనువదించవచ్చు.

(చూడండి:God, good news, world)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3335, H4639, H6213, H6385, H7069, G20410, G26020, G26750, G29360, G29370, G29390, G41600, G54800