te_tw/bible/other/bronze.md

2.3 KiB

కంచు

నిర్వచనం:

ఈ పదం "కంచు"ఒక రకమైన లోహాన్ని సూచిస్తున్నది. రాగి, తగరం కరిగించి కలిపి తయారు చేస్తారు. ఇది ముదురు గోధుమ రంగులో కొద్దిగా ఎరుపు రంగు కలిసి ఉంటుంది.

  • కంచు నీరు మూలంగా తుప్పు పట్టదు. ఇది వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది.
  • ప్రాచీన కాలంలో, కంచును పరికరాలు, ఆయుధాలు, చిత్రాలు, బలిపీఠం, వంట పాత్రలు, సైనికుల కవచాలు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు.
  • ప్రత్యక్ష గుడారం, ఆలయం కోసం ఉపయోగించిన అనేక నిర్మాణ సాధనాలను కంచుతో చేశారు.
  • అబద్ధ దేవుళ్ళ విగ్రహాలను తరచుగా కంచు లోహంతో చేసేవారు.
  • కంచు వస్తువులను మొదట కంచు లోహం కరిగించి ఆ తరువాత పోత పోయడం ద్వారా చేసేవారు. ఈ పద్ధతిని "పోత విధానం" అంటారు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: కవచం, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5153, H5154, H5174, H5178, G5470, G5474, G5475