te_tw/bible/other/bearanimal.md

1.5 KiB

ఎలుగుబంటి, ఎలుగుబంట్లు

నిర్వచనం:

ఎలుగుబంటి నాలుగు కాళ్ళ పెద్ద జంతువు. గోధుమ, నలుపు రంగు బొచ్చుతో, పదునైన కోరలతో గోళ్ళతో ఉంటుంది. బైబిల్ కాలాల్లో ఇస్రాయెల్ దేశంలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి.

  • ఇవి అడవుల్లో, కొండల్లో నివసిస్తాయి. చేపలు, పురుగులు, మొక్కలు వీటి ఆహారం.
  • పాత నిబంధనలో ఎలుగుబంటిని బలానికి సూచనగా వాడతారు.
  • దావీదు తన గొర్రెలను కాచే సమయంలో ఒక ఎలుగుబంటితో పోరాడి ఓడించాడు.
  • రెండు ఎలుగుబంట్లు అడవిలోనుండి బయటికి వచ్చి ఎలీషా ప్రవక్తను ఎగతాళి చేసిన కొందరు యువకులపై దాడి చేసాయి.

(చూడండి: దావీదు, ఎలీషా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1677, G715