te_tw/bible/other/acacia.md

1.8 KiB

తుమ్మ

నిర్వచనం:

ఈ పదం "తుమ్మ" ప్రాచీన కాలంలో కనాను ప్రదేశంలో పెరిగే సామాన్యమైన చెట్టు పేరు. నేటికీ ఆ ప్రాంతంలో ఇవి పెరుగుతాయి.

  • గోదుమ వన్నెలో ఉండే తుమ్మ చెట్టు కలప చాలా గట్టిగా నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి ఇది బాగా ఉపకరిస్తుంది.
  • ఇది దృఢంగా ఉండి నీటిని తనలో ఉంచుకుంటుంది గనక త్వరగా శిథిలం కాదు. దానిలో ఉండే సహజ రసాయనాల మూలంగా దీన్ని కీటకాలు నాశనం చెయ్యలేవు.
  • బైబిల్లో, తుమ్మ కర్రను ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసం చెయ్యడానికి వాడారు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: నిబంధన మందసం, ప్రత్యక్ష గుడారం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7848