2.8 KiB
2.8 KiB
ఫీనెహాసు
వాస్తవాలు:
ఫీనెహాసు అనే పేరు మీద పాత నిబంధనలో ఇద్దరు పురుషులు ఉన్నారు.
- వారిలో ఒకరు ఆహారోను మునిమనమడైన ఫీనెహాసు యాజకుడు, ఇతను ఇశ్రాయేలులో అబద్ద దేవుళ్ళ ఆరాధనను బలముగా తిరస్కరించినవాడు.
- ఇశ్రాయేలీయులు అబద్ద దేవుళ్ళను ఆరాధిస్తున్నందుకు మరియు మిద్యాను స్త్రీలను వివాహమాడినందుకు వారిని శిక్షించుటకు యెహోవా దేవుడు పంపించిన తెగులునుండి ఫీనెహాసు వారిని రక్షించెను.
- అనేక సందర్భాలలో మిద్యానీయులను నాశనము చేయుటకు ఫీనెహాసు ఇశ్రాయేలుతోపాటు బయలుదేరియుండెను.
- పాత నిబంధనలో చెప్పబడిన ఇంకొక ఫీనెహాసు ఎవరనగా ప్రవక్తయైన సమూయేలు కాలములో యాజకుడైన ఏలికి పుట్టిన కుమారులలో ఒకడైయుండెను.
- ఫిలిష్టియులు ఇశ్రాయేలుపై దాడి చేసినప్పుడు ఫీనెహాసు మరియు తన సహోదరుడైన హోఫ్నీలను చంపిరి మరియు అక్కడ వారిదగ్గర ఉన్నటువంటి నిబంధన మందసమును దొంగలించిరి.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చుడండి: నిబంధన మందసము, యోర్దాను నది, మిద్యాను, ఫిలిష్టియులు, సమూయేలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H6372