te_tw/bible/names/melchizedek.md

3.8 KiB

మెల్కీసెదెకు

వాస్తవాలు:

అబ్రహాము జీవించిన కాలంలో మెల్కీసెదెకు షాలేము పట్టణానికి రాజుగా ఉన్నాడు. (తరువాత దీనిని యెరూషలెం అని పిలిచారు).

  • మెల్కీసెదెకు అంటే “నీతికి రాజు” అని అర్థం, ఆయన బిరుదు “షాలేము రాజు” అంటే “సమాధాన రాజు” అని అర్థం.
  • ”సర్వోన్నతుడైన దేవుని యాజకుడు” అని కూడా పిలువబడ్డాడు.
  • అబ్రహాము తన అన్న కుమారుడు లోతును శక్తివంతమైన రాజులనుండి విడిపించిన తరువాత మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె, ద్రాక్షారసం పంచినపుడు బైబిలులో మొట్టమొదటిసారి కనిపిస్తాడు. అబ్రహాము తన విజయంనుండి వచ్చిన దోపుడు సొమ్ములో పదియవ భాగాన్ని మెల్కీసెదెకుకు ఇచ్చాడు.
  • కోత్తనిబందనలో తండ్రీ లేక తల్లి లేనివాడుగా మెల్కీసెదెకు వివరించబడ్డాడు. శాశ్వతకాలం పాలించే రాజుగా, యాజకుడిగా పిలువబడ్డాడు.
  • యేసు “మెల్కీసెదెకు యాజక క్రమం” చొప్పున యాజకుడిగా ఉన్నాడని కొత్తనిబంధన చెపుతుంది. ఇశ్రాయేలీయుల యాజకులవలే యేసు లేవీయులనుండి వచ్చినవాడు కాదు. ఆయన యాజకత్వం మెల్కీసెదెకుకు వలే నేరుగా దేవుని నుండి వచ్చింది.
  • బైబిలులో ఆయన వివరాలను ఆధారం చేసుకొని, మెల్కీసెదెకు మానవ యాజకుడు, దేవునిచేత ఏర్పరచబడినవాడు, సమాధానానికీ, నీతికీ నిత్యుడైన రాజు, మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుకు ప్రాతినిధ్యం వహించడానికీ లేక ఆయనను చూపించదానికీ దేవుని చేత ఏర్పరచబడినవాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అభ్రహాము, నిత్యత్వం, ప్రధాన యాజకుడు, యెరూషలెం, లేవీయుడు, యాజకుడు, నీతి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4442, G3198