te_tw/bible/kt/scribe.md

3.3 KiB
Raw Permalink Blame History

శాస్త్రి, శాస్త్రులు

నిర్వచనము:

శాస్త్రులు అధికారులైయుండిరి, వీరు తమ చేతులు ద్వారా మత సంబంధమైన పత్రాలను వ్రాయుటకు లేక ప్రాముఖ్యమైన ప్రభుత్వ సమాచారమును నకలు చేయుటయు లేక ఏదైనా విషయాలను వ్రాయుటకు బాధ్యతను వహించియుండిరి. యూదా శాస్త్రికి మరొక పేరు కలదు, అదేమనగా “యూదుల ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యపొందినవాడు.”

  • శాస్త్రులు పాత నిబంధన పుస్తకాలను తిరిగి ఎత్తి వ్రాయుటకు మరియు వాటిని భద్రపరచుటకు బాధ్యతను కలిగియుండిరి.
  • వారు దేవుని ధర్మశాస్త్రము మీద వ్యాఖ్యాన సహితమైన మత సంబంధమైన అభిప్రాయాలను మరియు వ్యాఖ్యలను చేయుచుండిరి, మరియు వీరు వాటిని నకలు చేసి, భద్రపరచుచుండిరి.
  • కొన్నిమార్లు శాస్త్రులు చాలా ప్రాముఖ్య ప్రభుత్వ ఆధికారులైయుండిరి.
  • బైబిలు గ్రంథములో ప్రాముఖ్యమైన శాస్త్రులలో బారూకు మరియు ఎజ్రాలు ఉండిరి.
  • క్రొత్త నిబంధనలో “శాస్త్రులు” అనే పదమును “ధర్మశాస్త్ర బోధకులు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • క్రొత్త నిబంధనలో శాస్త్రులు సాధారణముగా “ఫరిసయ్యులు” అనే మతసంబంధమైన గుంపులో ఒక భాగమైయుండిరి, మరియు ఈ రెండు గుంపులవారి పేర్లను బైబిలు గ్రంథములో తరచుగా పేర్కొనిరి.

(ఈ పదములను కూడా చూడండి:law, Pharisee)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H5608, H5613, H7083, G11220