4.5 KiB
4.5 KiB
దేవుని ప్రజలు
నిర్వచనము
“దేవుని ప్రజలు” అనే మాట దేవునితో ప్రత్యెకమైన సహవాసము చేయుటకు లోకములోనుండి ఆయన పిలుచుకొనిన ప్రజలను సూచిస్తుంది.
- “పాతనిబంధనలో “దేవుని ప్రజలు” అనే మాట దేవుని ద్వారా ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు జనాంగమును సూచిస్తుంది మరియు ఆయనకు లోబడుటకు, ఆయనను సేవించుటకు లోక దేశములలోనుండి ప్రత్యేకించబడిన జనములను సూచిస్తుంది.
- క్రొత్త నిబంధనలో “దేవుని ప్రజలు” అనే మాట విశేషముగా యేసునందు విశ్వాసముంచినవారిని మరియు సంఘము అని పిలువబడినవారిని సూచిస్తుంది. ఇందులో యూదులు మరియు అన్యులు కూడా ఉంటారు.క్రొత్త నిబంధనలో కొన్ని సార్లు ఈ ప్రజలను “దేవుని కుమారులు” లేక “దేవుని బిడ్డలు” అని పిలుస్తారు.
- “నా ప్రజలు” అని దేవుడు అన్నప్పుడు ఆయనతో నిబంధన చేసుకున్న ప్రజలను సూచిస్తున్నాడు. దేవుని ప్రజలు అయన ఎంచుకున్న ప్రజలు మరియు వారు తనకు నచ్చినట్టుగా జీవించాలని కోరుకుంటాడు.
అనువాదం సూచనలు:
- “దేవుని ప్రజలు” అనే మాటను “దేవుని ప్రజలు” లేక “దేవునిని ఆరాధించే ప్రజలు” లేక “ దేవునిని సేవించే ప్రజలు” లేక “దేవునికి సంబంధించిన ప్రజలు” అని తర్జుమా చేయవచ్చును.
- “నా ప్రజలు” అని దేవుడు చెప్పినప్పుడు, దీనిని తర్జుమా చేయు వేరొక విధానములో “నేను ఎన్నుకొనిన ప్రజలు” లేక “నన్ను ఆరాధించు ప్రజలు” లేక “నాకు సంబంధించిన ప్రజలు” అనే మాటలు కూడా వాడబడుతాయి.
- అదేవిధముగా, “మీ జనులు” అనే మాటను “మీకు సంబంధించిన ప్రజలు” లేక “మీకు సంబంధించియుండుటకు మీరు ఎన్నుకొనిన జనులు” అని తర్జుమా చేయవచ్చును.
- “ఆయన ప్రజలు” అను మాటను కూడా “ఆయనకు సంబంధించిన ప్రజలు” లేక “ఆయనకు సంబంధించియుండుటకు దేవుడు ఎన్నుకొనిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
(ఈ పదాలను కూడా చూడండి: Israel, people group)
బైబిల్ రెఫరెన్సులు:
- 1 దిన11:2
- అపో.కా 7:34
- అపో.కా 7:51-53
- అపో.కా 10:36-38
- దానియేలు 9:24-25
- యెషయా 2:5-6
- యిర్మియా 6:20-22
- యోవేలు 3:16-17
- మీకా 6:3-5
- ప్రకటన 13:7-8
పదం సమాచారం:
- Strong's: H430, H5971, G23160, G29920