te_tw/bible/kt/hades.md

4.1 KiB
Raw Permalink Blame History

పాతాళం, మృతుల లోకం

నిర్వచనం:

పదాలు "పాతాళం” “మృతుల లోకం" అనే మాటలను బైబిల్లో మరణం, చనిపోయిన తరువాత వారి ఆత్మలు వెళ్ళే స్థలం చెప్పడానికి ఉపయోగిస్తారు. రెండింటి అర్థాలు ఒకటే.

  • హీబ్రూ పదం "మృతుల లోకం" పాత నిబంధనలో సాధారణంగా మరణ స్థలం చెప్పడానికి తరచుగా ఉపయోగిస్తారు.
  • కొత్త నిబంధనలో, గ్రీకు పదం "పాతాళం" అనేది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆత్మలుండే స్థలాన్ని సూచిస్తున్నది. ఈ ఆత్మలు పాతాళంలోకి "దిగి పోతారు." కొన్ని సార్లు ఇది పరలోకానికి “ఎక్కి పోవడానికి” భిన్నమైనదిగా చెప్పారు. యేసుపై విశ్వసించిన వారి ఆత్మలు అక్కడ ఉంటాయి.
  • "పాతాళం," "మరణం" ఈ రెంటికీ ప్రకటన గ్రంథంలో సంబంధం ఉంది. అంత్య కాలంలో, రెండవ మరణం, పాతాళం ఈ రెంటినీ నరకం అనే అగ్ని సరస్సులో పడవేస్తారు.

అనువాదం సూచనలు:

  • పాత నిబంధన పదం "మృతుల లోకం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మృతుల స్థలం” లేక “చనిపోయిన ఆత్మలు ఉండే స్థలం." కొన్ని అనువాదాల్లో "గుంట” లేక “మరణం,"అని సందర్భాన్ని బట్టి తర్జుమా చేశారు.
  • దీన్ని కొత్త నిబంధన పదం "పాతాళం" అని కూడా తర్జుమా చెయ్యవచ్చు. "విశ్వసించని మృతుల ఆత్మలు ఉండే చోటు” లేక “మృతుల చిత్ర హింస స్థలం” లేక “విశ్వసించని మృతుల స్థలం."
  • కొన్ని అనువాదాలు "మృతుల లోకం” “పాతాళం," అని లక్ష్య భాష సంప్రదాయాన్ని బట్టి ఉపయోగిస్తాయి. (చూడండి: [అవ్యక్తాలను అనువదించడం ఎలా]).
  • ఒక్కొక్క పదాన్ని వివరిస్తూ కూడా అనువదించ వచ్చు. ఉదాహరణకు "మృతుల లోకం, చనిపోయిన వారు ఉండే స్థలం” “పాతాళం, మృత్యు లోకం."

(అనువాదం సలహాలు: How to Translate Unknowns)

(చూడండి: death, heaven, hell, tomb)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H7585, G00860