te_tw/bible/kt/confess.md

3.2 KiB
Raw Permalink Blame History

ఒప్పుకొను, ఒప్పుకోలు

నిర్వచనం:

ఒప్పుకొను అంటే దేన్నైనా నిజం అని అంగికరించడం. "ఒప్పుకోలు"అంటే దేన్నైనా నిజం అని బయటికి ప్రకటించడం.

  • ఈ పదం "ఒప్పుకొను" అనేది దేవుని గురించిన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం. మనం చేసిన పాపాన్ని అంగీకరించడం.
  • మనుషులు తమ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటే వారి పాపాలు దేవుడు, క్షమిస్తాడు అని బైబిల్ చెబుతున్నది.
  • విశ్వాసులు వారి పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకుంటే అది ఆత్మ సంబంధమైన స్వస్థత తెస్తుందని అపోస్తలుడు యాకోబు తన ఉత్తరంలో రాశాడు.
  • ఒక దినాన ప్రతి ఒక్కరూ యేసే ప్రభువు అని ఒప్పుకుంటారని, లేక ప్రకటిస్తారని అపోస్తలుడు పౌలు ఫిలిప్పి సంఘానికి రాశాడు.
  • పౌలు ఇది కూడా చెప్పాడు. యేసే ప్రభువు అని ఒప్పుకుని దేవుడు ఆయనను మృతుల లోనుంచి లేపాడని విశ్వసిస్తే వారు రక్షణ పొందుతారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, ఇలా కూడా అనువదించవచ్చు. "రానిచ్చు” లేక “సాక్ష్యం ఇచ్చు” లేక “ప్రకటించు” లేక “గుర్తించు” లేక “నిర్ధారించు."
  • దీన్ని రకరకాలుగా అనువదించ వచ్చు. "ఒప్పుకోలు" "ప్రకటన” లేక “సాక్షము” లేక “మనం విశ్వసించిన దాన్ని చెప్పడం” లేక “పాపం అంగీకరించు."

(చూడండి:faith, testimony)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3034, H8426, G18430, G36700, G36710