te_tw/bible/kt/church.md

6.3 KiB

సంఘం, సంఘం

నిర్వచనం:

కొత్త నిబంధనలో, "సంఘం" అనే పదం స్థానికంగా యేసు నందు విశ్వాసుల గుంపును సూచిస్తుంది. వీరు ప్రార్థన చెయ్యడానికీ, ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని వినడానికీ క్రమంగా కలుసుకుంటారు. పెద్ద అక్షరంతో ఆరంభమయ్యే "సంఘం" అనే పదం తరచుగా క్రైస్తవులందరినీ సూచిస్తుంది.

  • ఇది అక్షరాలా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం కలుసుకోడానికి "వెలుపలికి పిలువబడిన" ప్రజల సంఘం లేదా సమాజాన్ని అక్షరాలా సూచిస్తుంది.
  • ఈ పదం అన్ని ప్రదేశాలలో క్రీస్తు శరీరంలోని విశ్వాసులందరినీ సూచించడానికి ఉపయోగించబడింది. స్థానిక సంఘంనుండి భిన్నంగా ఉండడానికి కొందరు బైబిలు అనువాదకులు "సంఘం" పదంలోని మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంగా ఉంచారు.
  • తరచుగా ఒక పట్టణంలోని విశ్వాసులు ఒకరి గృహంలో కలుసుకొంటారు. ఈ స్థానిక సంఘాలకు "ఎఫెసులోని సంఘం" అన్నట్లుగా ఆ పట్టణం పేరు ఇవ్వబడుతుంది.
  • బైబిలులో "సంఘం" అంటే ఒక కట్టడాన్ని సూచించడం లేదు.

అనువాదం సలహాలు:

  • "సంఘం" అనే పదం "గుంపుగా కలవడం" లేదా “సంఘం" లేదా "సమాజం" లేదా గుంపుగా కలిసే వారు" అని అనువదించబడవచ్చు. *   ఈ పదాన్ని అనువదించడానికి ఉపయోగించే పదం లేదా పదబంధం కేవలం ఒక చిన్న గుంపును మాత్రమే కాక విశ్వాసులందరినీ సూచించేదిగా కూడా ఉండాలి.
  • "సంఘం" పదం అనువాదం ఒక కట్టడాన్ని సూచించేలా ఉండకుండా జాగ్రత్త పడాలి.
  • పాత నిబంధనలో "సంఘం" అనే పదాన్ని అనువదించడానికి ఉపయోగించిన పదం కూడా దీనిని అనువదించడానికి ఉపయోగించబడవచ్చు. *  దీనిని స్థానిక, జాతీయ బైబిలు అనువాదంలో ఇది ఏవిధంగా అనువదించబడిందో కూడా పరిశీలించండి. (చూడండి: తెలియని వాటిని అనువదించడం ఎలా)

(చూడండి:assembly, believe, Christian)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

*__43:12__పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు సుమారు 3,000 మంది ప్రజలు విశ్వసించారు, యేసు శిష్యులు అయ్యారు. వారు బాప్తిసం పొందారు, యెరూషలేము సంఘంలో భాగం అయ్యారు.

  • 46:9 అంతియొకయలో ఎక్కువమంది యూదులు కాదు. అయితే మొదటి సరిగా వారిలో అనేక మంది విశ్వాసులు అయ్యారు. బర్నబా, సౌలు ఈ కొత్త విశ్వాసులకు యేసును గురించి మరింత బోధించడానికీ సంఘాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్లారు.
  • 46:10 కాబట్టి అంతియొకయలో సంఘం బర్నబా, సౌలు కోసం ప్రార్థించి వారిపై చేతులు ఉంచారు. తరువాత వారిని సువార్త ప్రకటించడానికి అనేక ఇతర స్థలాలకు పంపారు.

*47:13 యేసు సువార్త వ్యాపిస్తూ సంఘం పెరుగుతూ వచ్చింది.

50:1 దాదాపు 2,000 సంవత్సరాలు, లోకమంతటా మరింత మంది ప్రజలు యేసును గురించిన సువార్త విన్నారు. సంఘం ఎదుగుతూ ఉంది.

పదం సమాచారం:

  •  Strong's: G15770