te_tw/bible/other/assembly.md

3.9 KiB
Raw Permalink Blame History

సమావేశం, సభలు, సమకూడడం, సమకూడిన

నిర్వచనం:

ఈ పదం "సమావేశం" సాధారణంగా కలిసి సమస్యలు చర్చించడం, సలహాలివ్వడం, నిర్ణయాలు చెయ్యడం కోసం వాడే పదం.

  • సమావేశం అంటే అధికారికంగా కొంత వరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పడేది. ఒక సమూహం తాత్కాలికంగా ఒక ఇదమిద్ధమైన ఉద్దేశం లేదా సందర్భం కోసం కలుసుకునేది.
  • పాత నిబంధనలో ప్రత్యేకమైన సమావేశాలను "పవిత్ర సమావేశం" అనే వారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సమకూడి యెహోవాను ఆరాధన చేస్తారు.
  • కొన్ని సార్లు ఈ పదం "సమావేశం"ఇశ్రాయేలీయులు సాధారణంగా గుంపు గూడే దానికి వర్తిస్తుంది.
  • శత్రు సైనికుల పెద్ద గుంపులను కొన్ని సార్లు "సమావేశం"అన్నారు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సైన్యం."
  • కొత్త నిబంధనలో, యెరూషలేమువంటి పెద్ద పట్టణాలలో 70మది యూదు నాయకుల సమావేశం జరుగుతుంది. అక్కడ వ్యక్తుల మధ్య చట్ట పరమైన విషయాలను చర్చించేవారు. ఈ సమావేశాన్ని "సన్ హెడ్రిన్” లేక “సమాలోచన సభ."అన్నారు.

అనువాదం సలహాలుల:

  • సందర్భాన్ని బట్టి దీన్ని "సమావేశం"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ప్రత్యేక సమావేశం” లేక “కూటం” లేక “సమాలోచన సభ” లేక “సైన్యం” లేక “పెద్ద గుంపు."
  • ఈ పదాన్ని "సమావేశం" అని ఉపయోగించినప్పుడు సాధారణంగా అది మొత్తంగా ఇశ్రాయేలీయులకు వర్తించేలా ఇలా తర్జుమా చెయ్య వచ్చు. "సమాజం” లేక “ఇశ్రాయేలు ప్రజలు."
  • "సర్వ సమావేశం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ప్రజలంతా” లేక “మొత్తంగా ఇశ్రాయేలీయుల బృందం” లేక “ప్రతి ఒక్కరూ." (చూడండి: అతిశయోక్తి)

(చూడండి:council)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0622, H1481, H2199, H3259, H4150, H4186, H4744, H5475, H5712, H6116, H6908, H6950, H6951, H6952, G15770, G38310, G48630, G48640, G48710, G49050