te_tw/bible/kt/bornagain.md

4.2 KiB
Raw Permalink Blame History

తిరిగి జన్మించడం, దేవుని మూలంగా జన్మించడం, నూతన జన్మ

నిర్వచనం:

"తిరిగి జన్మించడం" పదం ఆత్మీయంగా చనిపోయినవానిగా ఉన్న ఒక వ్యక్తిని ఆత్మీయంగా సజీవునిగా ఉండేలా దేవుడు చెయ్యడం గురించి వివరించడానికి యేసు చేత వినియోగించబడింది. "దేవుని మూలంగా జన్మించడం" మరియు "ఆత్మ మూలంగా జన్మించడం" పదాలు కూడా నూతన ఆత్మీయ జీవాన్ని పొందిన వ్యక్తిని సూచిస్తున్నాయి.

  • మానవులు అందరూ ఆత్మీయంగా చనిపోయినవారిగా జన్మించారు. యేసు క్రీస్తును వారి రక్షకుడుగా అంగీకరించినప్పుడు వారు ఒక "నూతన జన్మ" పొందారు.
  • ఆత్మ సంబంధమైన నూతన జన్మ పొందిన క్షణంలో, దేవుని పరిశుద్ధాత్మ నూతన విశ్వాసిలో జీవించడం ఆరంభం అవుతుంది మరియు అతని జీవితంలో మంచి ఆత్మీయ ఫలించడానికి అతనిని శక్తితో నింపుతాడు.
  • ఒక వ్యక్తి తిరిగి జన్మించేలా చెయ్యడమూ, దేవుని బిడ్డ అయ్యేలా చెయ్యడం దేవుని కార్యం. .

అనువాదం సూచనలు:

  • "తిరిగి జన్మించడం" పదాన్ని ఇతర విధానాలలో అనువదించడానికి "నూతనంగా జన్మించడం" లేదా "ఆత్మీయంగా జన్మించడం" పదాలు ఉండవచ్చు.
  • ఈ పదాన్నిఅక్షరాలా అనువదించడం, పుట్టడం పదం కోసం ఉపయోగించే బాషలోని సాధారణ పదాన్ని ఉపయోగించడం ఉత్తమం.
  • "నూతన జన్మ" పదం "ఆత్మ సంబంధమైన జన్మ" పదముగా అనువదించబడవచ్చు.
  • "దేవుని మూలంగా జన్మించడం" పదబంధం "నూతన శిశువు వలే నూతన జీవం పొందేలా దేవుడు చెయ్యడం" లేదా "దేవుడు నూతన జన్మ అనుగ్రహించాడు" అని అనువదించబడవచ్చు.
  • అదే విధంగా, "ఆత్మ మూలంగా జన్మించడం" పదబందం "పరిశుద్ధాత్మ నూతన జన్మ అనుగ్రహించాడు" లేదా "దేవుని బిడ్డగా మారడానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు" లేదా "నూతన శిశువు వలే నూతన జీవం పొందేలా పరిశుద్ధాత్మ చేసాడు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:Holy Spirit, save)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G03130, G05090, G10800, G38240