3.2 KiB
3.2 KiB
దైవదూషణ, దూషించడం, దూషణకరమైన
నిర్వచనము
బైబిల్లో " దూషణ" అనే పదం దేవుని పట్ల లేక ప్రజల పట్ల తీవ్రమైన అమర్యాదపూర్వకంగా మాట్లాడడాన్ని సూచిస్తుంది. ఎవరినైనా " దూషించుట” అంటే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ వ్యక్తి గురించి ఇతరులకు చెడు లాకా తప్పుడు అభిప్రాయం కలిగేలా చెయ్యడం.
- తరచుగా, దూషించుట అంటే దుర్భాషలాడడం, లేక ఒక వ్యక్తి గురించి అసత్యాలు పలికి అవమానించడం, లేక అతని ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం.
- మనిషి తాను దేవుడినని చెప్పుకోవడం, లేక నిజ దేవుడు కాక వేరే దేవుళ్ళు ఉన్నారని చెప్పడం దైవ దూషణ కిందికే వస్తుంది.
- కొన్ని అంగ్ల అనువాదాలు ఈ పదాన్ని మనుషుల విషయంలో వాడినప్పుడు "దుర్భాషలు" అని తర్జుమా చేసాయి.
అనువాదం సూచనలు:
- "దైవ దూషణ చేయి" అనే పదాన్ని "దేవునికి వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలుకు” లేక “దేవునికి అప్రతిష్ట కలిగించు” లేక “దుర్భాషలాడు" అని తర్జుమా చేయ వచ్చు.
- "దైవ దూషణ" అనే పదంలో "ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం” లేక “అపనింద” లేక “చెడు వార్తలు ప్రచారం చెయ్యడం." అన్న అనువాదాలు కూడా ఉంటాయి.
బైబిల్ రిఫరెన్సులు
- 1 తిమోతి 1:12-14
- అపో.కా 6:11
- అపో.కా 26:9-11
- యాకోబు 2:5-7
- యోహాను 10:32-33
- లూకా 12:10
- మార్కు 14:64
- మత్తయి 12:31
- మత్తయి 26:65
- కీర్తనలు 74:10
పదం సమాచారం
- Strong’s: H1288, H1442, H2778, H5006, H5007, H5344, G09870, G09880, G09890