te_tw/bible/other/slander.md

2.2 KiB

దూషణ, దూషకులు, దూషించడం, అవమానించు

నిర్వచనం:

దూషణలో మరొక వ్యక్తి గురించి వ్యతిరేకమైనవీ, అప్రతిష్ట కలిగించే మాటలు పలుకబడతాయి (రాయబడవు). ఒకరిని గురించి అటువంటి విషయాలు చెప్పడం (వ్రాయడం కాదు) అంటే ఆ వ్యక్తిని దూషించడం అవుతుంది.

·         దూషణ అనేది నిజమైన సమాచారం కావచ్చు లేదా అబద్ధ ఆరోపణ కూడా కావచ్చు, అయితే దీని ప్రభావం దూషణకు గురైన వ్యక్తిని గురించి ఇతరులు వ్యతిరేకంగా తలంచేలా చేస్తుంది.

·         “దూషించడం" అనే పదమును "వ్యతిరేకంగా మాట్లాడడం" లేదా "చెడు నివేదికను ప్రసారం/వ్యాప్తి చెయ్యడం" లేదా "అప్రతిష్ట చెయ్యడం" అని అనువదించవచ్చు.

·         దూషించే వాడు “తెలియజేసేవాడు” లేదా “కథలు మోసేవాడు" అని కూడా పిలువబడతాడు.

(చూడండి: దూషణ)

బైబిలు రిఫరెన్సులు:

·         1 కొరింథీ 04:13

·         1 తిమోతి 03:11

·         2 కొరింథీ 06:08-10

·         మార్కు 07:20-23

పదం సమాచారం:

·         Strong's: H1681, H1696, H1848, H3960, H5791, H7270, H7400, H8267, G09870, G09880, G12280, G14260, G26360, G26370, G30590, G30600