te_tw/bible/kt/birthright.md

2.4 KiB

జన్మ హక్కు

నిర్వచనం:

ఈ పదం "జన్మ హక్కు"అనేది బైబిల్లో ఒక కుటుంబంలో మొదట పుట్టిన కుమారునికి సంక్రమించే ప్రతిష్ట, కుటుంబం పేరు, సంపదలను సూచిస్తుంది.

  • మొదట పుట్టిన కుమారుని జన్మ హక్కు ప్రకారం తండ్రి వారసత్వ ఆస్తిలో రెండు పాళ్ళు వస్తుంది.
  • రాజు పెద్దకొడుక్కి సాధారణంగా తన తండ్రి చనిపోయాక పరిపాలన చేసే జన్మ హక్కు ఉంటుంది.
  • ఏశావు తన జన్మ హక్కును తన తమ్ముడు యాకోబుకు అమ్మి వేశాడు. మొదట పుట్టిన ఏశావు వారసత్వంగా పొందే ఆశీర్వాదం యాకోబు పొందాడు.
  • జన్మ హక్కులో వంశ చరిత్ర మొదట పుట్టిన కుమారుని కుటుంబం ద్వారా కొనసాగే ప్రతిష్ట ఇమిడి ఉంది.

అనువాదం సలహాలు:

  • "జన్మ హక్కు"అనే దాన్ని అనువదించడం. "ఆస్తి విషయంలో మొదట పుట్టిన కుమారునికి ఉన్న హక్కు” లేక “కుటుంబం ప్రతిష్ట” లేక “మొదట పుట్టినవాడి ఆధిక్యత వారసత్వ సంపద."

(చూడండి: మొదట పుట్టిన, వారసత్వముగా పొందు, సంతతి వాడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1062, G4415