te_tw/bible/other/thorn.md

2.5 KiB

ముల్లు, ముళ్ళపొద, ముళ్ళపొదలు, ముళ్ళు, గచ్చ పొద

వాస్తవాలు:

ముళ్ళపొదలు అంటే కొమ్మలకు, పువ్వులకు ముళ్ళు ఉన్న మొక్కలు. ఈ మొక్కలకు పండ్లు, ఇతరత్రా ఉపయోగకరం అయినవి ఏమీ ఉండవు.

  • "ముల్లు" కఠినంగా ఉండి మొక్క కాండానికి, కొమ్మలకి ఉంటుంది. "ముళ్ళపొద" చిన్నచెట్టు లేక పొద. దీని కొమ్మలకు అనేక ముళ్ళు ఉంటాయి.
  • "గచ్చ పొద" అనేది ముళ్ళతో నిండిన కాండం ఆకులూ ఉన్న మొక్క. తరచుగా పువ్వులు ఊదా రంగులో ఉంటాయి.
  • ముళ్ళ మొక్కలు, గచ్చ పొదలు సాధారణంగా త్వరగా పెరుగుతాయి. ఇతర మొక్కలను, పంటలను పెరగనీయకుండా చేస్తాయి. ఇది పాపం ఏ విధంగా ఒక వ్యక్తి నుండి మంచి ఆత్మ సంబంధమైన ఫలం లేకుండా చేస్తుందో సూచిస్తుంది.
  • ముళ్ళతో చేసిన కిరీటం ఒకదానిని సిలువ వేయక ముందు యేసుశిరస్సుపై ఉంచారు.
  • వీలైతే, ఈ పదాలను మీ ప్రాంతంలో పెరిగే వివిధ మొక్కలు లేక పొదల పేర్లతో అనువదించ వచ్చు.

(చూడండి: కిరీటం, పండు, ఆత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H329, H1863, H2312, H2336, H4534, H5285, H5518, H5544, H6791, H6796, H6975, H7063, H7898, G173, G174, G4647, G5146