te_tw/bible/other/crown.md

4.6 KiB

కిరీటం, కిరీటాలు, కిరీటం ధరించిన

నిర్వచనం:

కిరీటంతలపై ధరించే అలంకారికమైన, గుండ్రని ఆభరణం. రాజులూ రాణులూ మొదలైన అధిపతులు వీటిని ధరిస్తారు. "కిరీటం" పెట్టడం అంటే ఎవరి తలపై అయినా అలంకారికంగాలేక "ప్రతిష్ట" కలిగేలా కిరీటం పెట్టడం.

  • కిరీటాలను సాధారణంగా బంగారం లేక వెండితో చేస్తారు. విలువైన పచ్చలు, కెంపులు వంటి రత్నాలు పొదుగుతారు.
  • కిరీటం ఒక రాజు శక్తికి సంపదకు సంకేతం.
  • ఇందుకు భిన్నంగా, రోమా సైనికులు యేసు తలపై పెట్టిన ముళ్ళ కిరీటం ఆయన్ను హేళన చేసి గాయపరచడానికి.
  • ప్రాచీన కాలంలో, పరుగు పందేలలో విజేతలకు ఒలీవ ఆకులతో చేసిన కిరీటాన్ని బహూకరణ చేసే వారు. అపోస్తలుడు పౌలు తిమోతికి తన రెండవ పత్రికలో ఈ కిరీటాన్ని ప్రస్తావించాడు.
  • అలంకారికంగా, "కిరీటం" పెట్టడం అనే మాటను ఎవరినైనా గౌరవించడానికి ఉపయోగిస్తారు. దేవునికి లోబడడంద్వారా ఇతరులకు అయన గురించి చెప్పడం ద్వారా కిరీట ధారణ చేస్తాము. ఇది అయన తలపై కిరీటం పెట్టడం తోనూ ఆయన్ను రాజుగా గుర్తించడంతోనూ సమానం.
  • పౌలు సాటి విశ్వాసులను తన "ఆనందం, కిరీటం" తో పోల్చాడు. ఇక్కడ "కిరీటం" అనే మాటను పౌలు అలంకారికంగా ఈ విశ్వాసులు దేవుణ్ణి సేవించడంలో నమ్మకమైన వారుగా ఉండి తనకు గొప్ప ధన్యతను గౌరవాన్ని ఇచ్చారు అని చెప్పాడు.
  • దీనిని అలాకారికంగా కూడా ఉపయోగిస్తారు. "కిరీటం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బహుమానం” లేక “ప్రతిష్ట” లేక “ప్రతిఫలం."
  • అలంకారికంగా "కిరీటం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రతిష్ట” లేక “అలంకరించడం."
  • ఒక వ్యక్తి "కిరీటం ధరించిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఒక కిరీటం తన శిరస్సుపై ఉంది."
  • "అతడు మహిమ, ప్రతిష్టలతో కిరీటం ధరించిన" ఇలా అనువదించ వచ్చు, "మహిమ, ప్రతిష్ట అతనికి దక్కాయి.” లేక “అతనికి మహిమ, ప్రతిష్ట ఇవ్వబడ్డాయి” లేక “అతడు మహిమ, ప్రతిష్ట పొందాడు."

(చూడండి: మహిమ, రాజు, ఒలీవ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2213, H3803, H3804, H4502, H5145, H5849, H5850, H6936, G1238, G4735, G4737