te_tw/bible/other/sword.md

5.6 KiB

ఖడ్గము, ఖడ్గములు, ఖడ్గములు పట్టువారు

నిర్వచనము:

ఖడ్గము అనగా పొడుచుటకు లేక కత్తరించుటకు ఉపయోగించే చాలా పదునైన లోహపు కత్తి అని అర్థము. ఈ కత్తిని పట్టుకొనుటకు పిడి ఉండి, ఇది చాలా పొడువుగా ఉంటూ, కత్తికి ఒక వైపు కత్తరించుటకు చాలా ఎక్కువ పదును చేసియుందురు.

  • పురాతన కాలములో ఖడ్గపు కత్తి యొక్క పొడవు దాదాపు 60 నుండి 91 సెంటి మీటర్లు ఉండేది.
  • కొన్ని ఖడ్గములకు ఇరువైపులా పదును పట్టియుందురు, దీనిని “రెండంచుల ఖడ్గము” అని లేక “ఇరువైపుల ఉన్న” ఖడ్గములు అని పిలిచెదరు.
  • యేసు శిష్యులు తమ రక్షణకొరకు కత్తులను కలిగియుండిరి. పేతురు తన కత్తిని తీసి, మహా యాజకుని దాసుడైనవాని చెవిని తెగ నరికెను.
  • బాప్తిస్మము ఇచ్చు యోహాను మరియు అపొస్తలుడైన యాకోబులిరువురు ఖడ్గముల ద్వారా శిరచ్చేదనము చేయబడిరి.

తర్జుమా సలహాలు:

  • ఖడ్గము అనే పదమును దేవుని వాక్యముకొరకు రూపకలంకారముగా ఉపయోగించబడింది. పరిశుద్ధ గ్రంథములోని దేవుని బోధనలు ప్రజల అంతర్గత ఆలోచనలను మరియు వారు తమ పాపములను ఒప్పుకొనుటను ఎత్తి చూపింది. అదే విధముగా, ఖడ్గము చాలా లోతుగా కత్తరిస్తుంది, ఎంతో బాధను కలుగజేస్తుంది. (చూడండి: రూపకలంకారము)
  • ఈ పదముయొక్క అలంకారిక ఉపయోగాలను తర్జుమా చేయు విధానములలో “దేవుని వాక్యము ఖడ్గమువలె ఉండును, అది చాలా లోతుగా కత్తరించి పాపమును ఎత్తిచూపును” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదము యొక్క అలంకారిక వాక్కులు కీర్తనల గ్రంథములో కనిపిస్తాయి, ఇక్కడ ఒక వ్యక్తి నాలుక లేక అతని మాటలు ఖడ్గమునకు పోల్చియున్నారు. ఈ నాలుక లేక మాటలు ప్రజలకు హాని కలుగజేస్తాయి. దీనిని “నాలుక ఒకరిని అతీ దారుణముగా గాయము చేసే ఖడ్గములాంటిది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఒకవేళ మీ సంస్కృతిలో ఖడ్గము గూర్చి తెలియకపొతే, నరకుటకు లేక పొడుచుటకు ఉపయోగించే అతీ పొడువాటి సాధనపు పేరుతొ ఈ వాక్యమును తర్జుమా చేయవచ్చును.
  • ఖడ్గమును “పదునైన సాధనము” అని లేక “పొడువాటి కత్తి” అని కూడా వివరించి చెప్పుదురు. కొన్ని తర్జుమాలు ఖడ్గము యొక్క చిత్రపటమును కూడా చేర్చియుందురు.

(దీనిని చూడండి: తెలియని వాటిని ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: యాకోబు (యేసు సహోదరుడు), యోహాను (బాప్తిస్మమిచ్చువ్యక్తి), నాలుక, దేవుని వాక్యము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H19, H1300, H2719, H4380, H6609, H7524, H7973, G3162, G4501