te_tw/bible/other/stronghold.md

4.3 KiB

బలమైన దుర్గము, బలమైన కోటలు, దుర్గములు, దుర్గము కట్టబడెను, కోట, కోటలు

నిర్వచనము:

“బలమైన దుర్గము” మరియు “కోట” అనే రెండు పదాలు శత్రు సైన్యముద్వారా దాడి జరిగినప్పుడు సురక్షితముగా ఉండే స్థలాలను సూచిస్తుంది. “దుర్గము” అనే పదము దాడినుండి సురక్షితముగా ఉంచే పట్టణమును లేక ఇతర స్థలమును వివరించును.

  • అనేకమార్లు, బలమైన ఆశ్రయాలు మరియు కోటలు బలమైన గోడలతో మనుష్యులు నిర్మించినవే. అవి స్వాభావికముగానే సంరక్షించే బండలను కలిగిన గోడలను లేక ఎత్తైన కొండలను కూడా కలిగియుంటాయి.
  • ఎదుటి శత్రువు పడగొట్టలేనంత బలమైన నిర్మాణములుగా లేక ఎక్కువ వెడల్పుతో కూడిన బలమైన గోడలను నిర్మించుట ద్వారా ప్రజలు దుర్గములను నిర్మించిరి.
  • “బలమైన దుర్గము” లేక “కోట” అనే పదమును “భద్రమైన బలమైన స్థలము” లేక “బలమైన సంరక్షణను కలిగించు స్థలము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “దుర్గమైన పట్టణము” అనే ఈ మాటను “భద్రతనిచ్చు సురక్షితమైన పట్టణము” లేక “బలముగా నిర్మించిన పట్టణము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • దేవుడు తనను నమ్మినవారికి బలమైన ఆశ్రయమని లేక కోటయని సూచించుటకు కూడా ఈ పదమును ఉపయోగించుదురు. (చూడండి: రూపకలంకారము)
  • “బలమైన దుర్గము” అనే పదమునకున్న మరియొక అలంకారిక అర్థము భద్రతకొరకు ఒకరు తప్పుగా నమ్మినదానిని సూచించును, ఉదాహరణకు, యెహోవాకు బదులుగా ఆరాధించే ఏదైనా లేక తప్పుడు దేవుడు. దీనిని “తప్పుడు బలమైన ఆశ్రయము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదమును దుర్గముకంటే ఇంకా ఎక్కువ భద్రతనిచ్చే “ఆశ్రయము” అనే పదమునకు భిన్నముగా తర్జుమా చేయాలి.

(ఈ పదములను కూడా చూడండి: తప్పుడు దేవుడు, తప్పుడు దేవుడు, ఆశ్రయము, యెహోవా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H490, H553, H759, H1001, H1002, H1003, H1219, H1225, H2388, H4013, H4026, H4581, H4526, H4679, H4685, H4686, H4692, H4693, H4694, H4869, H5794, H5797, H5800, H6438, H6696, H6877, H7682, G3794, G3925