te_tw/bible/other/refuge.md

5.8 KiB

ఆశ్రయము, శరణాగతుడు, శరణాగతులు, వసతి గృహము, వసతి గృహములు, వసతి అందించబడియున్నది, వసతి అందించు

నిర్వచనము:

“ఆశ్రయము” అనే ఈ పదము ఒక స్థలమును లేక సంరక్షణ మరియు భద్రత స్థితిని సూచించుచున్నది. “శరణాగతుడు” అనగా సురక్షితమైన స్థలము కొరకు ఎదురుచూచుచున్న వ్యక్తి అని అర్థము. “వసతి గృహము” అనే ఈ మాట వాతావరణమునుండి లేక అపాయమునుండి సంరక్షించే స్థలమును సూచించుచున్నది.

  • పరిశుద్ధ గ్రంథములో అనేకమార్లు దేవుణ్ణి ఆశ్రయముగా అనగా తన ప్రజలు భద్రముగా, సురక్షితముగా మరియు బాగుగా ఉండే స్థలముగా సూచించబడియున్నది.
  • పాత నిబంధనలోని “ఆశ్రయ పురము” అనే ఈ మాట ఒక వ్యక్తి ఆకస్మికముగా మరొక వ్యక్తిని చంపినప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రజలు తనపై దాడిచేయకుండా వారినుండి సురక్షిత స్థలము కొరకు పారిపోయి ఉండే అనేక పట్టణములలో ఒక దానిని సూచించుచున్నది.
  • “వసతి గృహము” అనునది అనేకమార్లు ప్రజలు లేక ప్రాణులకు సంరక్షణను కల్పించే పైకప్పులాంటి లేక భవనములాంటి భౌతికమైన కట్టడయైయున్నది.
  • లోతు అతిథులు తన పైకప్పు యొక్క “వసతి గృహములో” ఉన్నారని చెప్పినట్లు కొన్నిమార్లు “వసతి గృహము” అనే మాటకు “సంరక్షణ” అనే అర్థము కలదు. వారు సురక్షితముగా ఉంటారు ఎందుకంటే ఆయన తన ఇంటి సభ్యులుగా రక్షించుటకు బాధ్యత తీసుకొనునని ఆయన చెప్పియున్నాడు.

తర్జుమా సలహాలు:

  • “ఆశ్రయము” అనే ఈ పదమును “సురక్షిత స్థలము” లేక “సంరక్షించు స్థలము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “శరణాగతులు” అపాయకరమైన పరిస్థితినుండి తప్పించుకొనుటకు తమ ఇంటిని దేశమును సహితము విడిచి వచ్చే ప్రజలైయున్నారు, మరియు వీరిని “విదేశీయులు”, “ఇల్లు లేనివారు” లేక “పరదేశీయులు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “వసతి గృహము” అనే ఈ మాటను “సంరక్షించే స్థలము” లేక “సంరక్షణ” లేక “సంరక్షించబడిన స్థలము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఒకవేళ ఇది భౌతిక సంబంధమైన కట్టడనను సూచించినట్లయితే, “వసతి గృహము” అనే ఈ మాటను “సంరక్షించే భవనము” లేక “సురక్షితమైన ఇల్లు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సురక్షితమైన వసతి గృహములోనికి” అనే ఈ మాటను “సురక్షితమైన స్థలములోనికి” లేక “సంరక్షించే స్థలములోనికి” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “వసతి గృహమును కనుగొను” లేక “వసతి గృహము తీసుకో” లేక “ఆశ్రయించు” అనే ఈ మాటలను “సంరక్షించే స్థలమును కనుగొను” లేక “సంరక్షణకలిగిన స్థలములోనికి నడిపించు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2620, H4268, H4498, H4585, H4733, H4869