te_tw/bible/other/spear.md

2.9 KiB

ఈటె, ఈటెలు, ఈటెలను విసరువారు

నిర్వచనము:

ఈటె అనగా ఒక నిలువాటి కర్రకు ఒకవైపు తుది భాగాన పదునైన లోహపు కత్తిని కట్టి చేసిన ఒక పని ముట్టు, దీనిని అవసరమైనప్పుడు దూరాన విసిరివేతురు.

  • ఈటెలను సాధారణముగా పరిశుద్ధ గ్రంథ కాలాలలో యుద్ధము కొరకు ఉపయోగించేవారు. ఇప్పటికీ కొంత మంది ప్రజల వర్గాల మధ్య గొడవలు వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తారు.
  • యేసును సిలువకు వేసినప్పుడు ఆయన ప్రక్కలో గుచ్చుటకు రోమా సైనికుడి ద్వారా ఈటె వాడబడియున్నది.
  • కొన్నిమార్లు ప్రజలు వేటకు వెళ్లినప్పుడు ప్రాణులను పట్టుకునేందుకు లేక చేపలను పట్టుకునేందుకు ఈటెలను ఉపయోగిస్తారు.
  • దీనిని పోలిన ఆయుధాలు ఏమనగా “తేలికరకం ఈటె” లేక “బల్లెము”.
  • తర్జుమా చేయబడిన “ఈటె” అనే పదానికి పొడిచేందుకు లేక నరికేందుకు (విసరడానికి ఉపయోగించకుండ) ఉపయోగించే “ఖడ్గము” అనే ఆయుధమునకు వ్యత్యాసముండునట్లు చూచుకొనుడి. ఖడ్గము పట్టుకోవడానికి చిన్న పిడిని, చాలా ఎత్తైన కత్తిని కలిగియుంటుంది, ఈటె పొడవాటి కర్రను కలిగియుండి ఆ కర్రకు చివర చిన్న కత్తిని కలిగియుంటుంది.

(ఈ పదములను కూడా చూడండి: వేట, రోమా, ఖడ్గము, యోధుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1265, H2595, H3591, H6767, H7013, H7420, G3057