te_tw/bible/other/sister.md

3.8 KiB

సహోదరి, సహోదరియులు

నిర్వచనము:

సహోదరి అనగా తోడబుట్టిన వారితో ఒక తల్లినైనా లేక ఒక తండ్రినైనా కలిగియుండె స్త్రీయైయుండెను. ఈమె ఇతర వ్యక్తికి సహోదరియని (అక్క లేక చెల్లెలు) లేక ఇతర వ్యక్తి యొక్క సహోదరియని పిలువబడుతుంది. క్రొత్త నిబంధనలో “సహోదరి” అనే పదమును యేసునందు తోటి విశ్వాసియైన స్త్రీని సూచించుటకు అలంకారికముగాను ఉపయోగించబడుతుంది.

  • కొన్నిమార్లు “సహోదరి, సహోదరులు” అనే మాటను క్రీస్తునందు విశ్వాసులైన స్త్రీ పురుషులనందరిని సూచించుటకు ఉపయోగించడమైనది.
  • పాతనిబందనలోని పరమగీతములు అనే పుస్తకములో “సహోదరి” అనే పదము ప్రేమికురాలును లేక భార్యను సూచించుచున్నది.

తర్జుమా సలహాలు:

  • స్వాభావికమైన లేక స్వంత సహోదరిని సూచించుటకు అనువాద భాషలో ఉపయోగించే అక్షరార్థ పదముతో ఈ పదమును తర్జుమా చేయడము చాలా ఉత్తమము, అయితే తప్పు అర్థము ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
  • ఈ పదమును తర్జుమా చేయు ఇతర విధానములలో “క్రీస్తునందు సహోదరి” లేక “అత్మీయ సహోదరి” లేక “యేసును విశ్వసించిన స్త్రీ” లేక “తోటి స్త్రీ విశ్వాసి” అనే మాటలను కూడా ఉపయోగించుదురు.
  • సాధ్యమైతే కుటుంబములో ఉపయోగించే పదమును ఉపయోగించడం చాలా మంచిది.
  • “విశ్వాసి” అనే పదమును స్త్రీకి అన్వయించినప్పుడు, స్త్రీని విశ్వాసిగా సంబోధించే ఒకే పదముతో తర్జుమా చేయడము మంచిది. ఉదా. విశ్వాసురాలు.
  • ప్రేమికురాలుకు లేక భార్యకు వర్తించినప్పుడు, “ప్రియతమా” లేక “ప్రియమైన” అని స్త్రీ సంబోధించే విధానములో తర్జుమా చేయుట మంచిది.

(ఈ పదములను కూడా చూడండి: సహోదరుడు, క్రీస్తులో, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H269, H1323, G27, G79