te_tw/bible/other/shadow.md

3.2 KiB

ఛాయ, చాయలు, నీడ పైబడుట, నీడ పైబడినది

నిర్వచనము:

“ఛాయ” అనే పదము అక్షరార్థముగా వెలుగును అడ్డగించే ఒక వస్తువు ద్వారా పుట్టేటువంటి చీకటిని సూచిస్తుంది. దీనికి అనేకమైన అలంకార అర్థములు కలవు.

  • “మరణపు ఛాయ” అనే మాటకు మరణము ఇప్పుడే సంభవిస్తుంది లేక దగ్గరలో ఉంది అని అర్థము, నీడ వస్తువును ఎలా సూచిస్తుందో అలాగే మరణము సూచిస్తుంది.
  • పరిశుద్ధ గ్రంథములో అనేకమార్లు మనుష్యుని జీవితము పదార్థముకానిది, ఎంతో కాలము ఉండనిదియునైన ఛాయకు లేక నీడకు పోల్చబడియున్నది.
  • కొన్నిమార్లు “నీడ” అనే పదము “చీకటి” అనే పదముకొరకు పర్యాయ పదముగా ఉపయోగించబడియున్నది.
  • దేవుని రెక్కల నీడలో లేక దేవుని చేతి నీడలో దాచబడియుండుటను గూర్చి లేక సంరక్షించబడుటను గూర్చి పరిశుద్ధ గ్రంథము మాట్లాడును. ఇది అపాయకరమైన వాటినుండి దాచబడియుండుటను గూర్చి మరియు సంరక్షించబడియుండుటను గూర్చిన వివరణయైయున్నది. ఇటువంటి సందర్భాలలో “నీడ లేక ఛాయ” అనే పదమును తర్జుమా చేయు విదానములలో “కప్పు” లేక “భద్రత” లేక “సంరక్షణ” అనే పదాలను కూడా ఉపయోగించుదురు.
  • నిజమైన నీడను సూచించుట ఉపయోగించే స్థానిక పదమును “ఛాయ” అనే పదమునకు తర్జుమా చేయుట మంచిది.

(ఈ పదములను కూడా చూడండి: చీకటి, వెలుగు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2927, H6738, H6751, H6752, H6754, H6757, H6767, G644, G1982, G2683, G4639