te_tw/bible/other/scepter.md

2.6 KiB

రాజదండం, రాజదండములు

నిర్వచనము:

“రాజదండం: అనే ఈ పదము రాజులాంటి ఒక వ్యక్తి ద్వారా ఉపయోగించబడే దుడ్డు కర్ర లేక అలంకరించబడిన కర్రను సూచిస్తుంది.

  • రాజదండములు వాస్తవానికి చెక్కను అలంకారకృతములుగా చెక్కి తయారుచేయడం జరుగుతుంది. ఆ తరువాత రాజదండములు బంగారమువంటి విలువైన లోహములతో కూడా తయారు చేయుదురు.
  • రాజదండము రాజరికమునకు, అధికారమునకు మరియు గౌరవమునకు మరియు రాజుతో పాటు హుందాతనముకు గురుతుయైయున్నది.
  • పాత నిబంధనలో దేవుడు నీతియను రాజదండమును కలిగియున్నాడని చెప్పబడియున్నది, ఎందుకంటే దేవుడు తన ప్రజల మీద రాజుగా పరిపాలించియున్నాడు.
  • పాత నిబంధనలోని ప్రవచనము మెస్సయ్యాను సమస్త దేశములను పరిపాలించుటకు ఇశ్రాయేలునుండి వచ్చే రాజదండముగా సూచించబడినది.
  • దీనిని “పాలించు దండము” అని లేక “రాజు యొక్క దండము” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: అధికారము, క్రిస్త, రాజు, నీతి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2710, H4294, H7626, H8275, G4464