te_tw/bible/other/puffed-up.md

2.3 KiB

పొంగిపోవుట, పొంగిపోవునట్లు చేయుట

నిర్వచనముప:

“పొంగిపోవుట” అనే ఈ పదము గర్వంగా ఉండుటను లేక అహంకారముగా ఉండుటను సూచించే ఒక అలంకారిక మాటయైయుండెను. (చూడండి: నానుడి)

  • పొంగిపోయిన ఒక వ్యక్తి ఇతరులపట్ల ఉన్నతడనే భావనను కలిగియుంటాడు.
  • ఎక్కువ సమాచారమును తెలుసుకొనుట లేక ఎక్కువ భక్తి సంబంధమైన అనుభవమును కలిగియుండుట “పొంగిపోవుటకు” లేక గర్వంగా ఉండుటకు దారి తీయునని పౌలు చెప్పెను.
  • ఇతర భాషలు కూడా ఇదే అర్థమును తెలియజేసే విభిన్నమైన మాటను లేక ఇదే విధమైన నానుడిని కలిగియుండవచ్చు, “పెద్ద తలను కలిగియుండుట” అని ఒక ఉదాహరణ చెప్పవచ్చును.
  • ఈ మాటను “ఎక్కువ గర్వంగా” లేక “ఇతరులపట్ల ఏహ్యభావము” లేక “గర్వముగల” లేక “ఇతరులకంటే తను ఉన్నతమైనవాడని ఎంచుకొనుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: అహంకారము, గర్వము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6075, G5229, G5448