te_tw/bible/other/proud.md

6.3 KiB

అహంకారము, అహంకారముగల, గర్వము, గర్వముగల

నిర్వచనము:

“గర్వము” మరియు “గర్వముగల” అనే ఈ పదములు అందరికంటే గొప్పవాడని ఆలోచించుకొనే ఒక వ్యక్తిని సూచిస్తుంది, విశేషముగా, ఇతరులకంటే తనే ఉత్తముడని ఆలోచించుకొనే వ్యక్తిని సూచిస్తుంది.

  • గర్వముగల ఒక వ్యక్తీ అనేకమార్లు తన తప్పులను తానూ ఎప్పుడు బయటకి చెప్పుకోడు. అతను తగ్గింపుగల వ్యక్తి కాదు.
  • గర్వము అనునది అనేక విషయములలో దేవునికి అవిధేయత చూపించునట్లు చేయవచ్చును.
  • “అహంకారము” మరియు “గర్వము” అనే ఈ పదములను అనుకూల భావనలో కూడా ఉపయోగించుదురు, ఉదాహరణకు, ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు “గర్వకారణముగా” భావిస్తారు మరియు మీ పిల్లలనుబట్టి మీరు “గర్విస్తారు”. “నీ పనినిబట్టి నీవు గర్వించు” అనే మాటకు నీ పనిని బాగుగా చేయుటలో నీవు సంతోషమును వెదకు అని అర్థము.
  • ఒక వ్యక్తి తనను సాధించిన దానినిబట్టి ఎటువంటి అహంకారము లేకుండా గర్వించదగ్గవాడిగా ఉండవచ్చు. కొన్ని భాషలలో “గర్వము” అనే పదముకు రెండు పదముల విభిన్నమైన అర్థాలను కలిగియుంటారు.
  • “గర్వముగా” అనే ఈ మాట ఎల్లప్పుడు అనానుకూలంగా ఉంటుంది, ఈ మాటకు “అహంభావి” లేక “అహంకరించినవాడు” లేక “స్వయం-ప్రాముఖ్యతను ఎంచువాడు” అనే అర్థాలు కలవు.

తర్జుమా సలహాలు;

  • “గర్వము” అనే నామవాచకమును “అహంకారము” లేక “దర్పం” లేక “స్వయం-ప్రాముఖ్యత” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • వేరొక సందర్భాలలో “గర్వము” అనే పదమును “ఆనందము” లేక “తృప్తి” లేక “సంతోషము” అని కూడా తర్జుమా చేస్తారు.
  • “గర్వకారణముగా ఉండుట” అనే ఈ మాటకు “సంతోషము పొందియుండుట” లేక “తృప్తికరముగా ఉండుట” లేక “(సాధించిన వాటి విషయములో) ఆనందముగా ఉండుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “నీ పనిని బట్టి నీవు గర్వించు” అనే ఈ మాటను “నీ పనిని బాగుగా చేయుటలో తృప్తిని కనుగొను” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “యెహోవానుబట్టి గర్వించు” అనే ఈ మాటను “యెహోవా చేసిన అద్భుతమైన కార్యములన్నిటినిబట్టి సంతోషించు” లేక “యెహోవా ఎంత అద్భుతకరుడో అనుదానినిబట్టి ఆనందించు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: అహంకారము, తగ్గింపు, ఆనందము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 04:02 వారు ఎంతో గర్వించిరి, వారు దేవుడు చెప్పిన విషయాలను ఎంత మాత్రము లెక్క చేయలేదు.
  • 34:10 ఆ తరువాత, “నేను మీకు సత్యము చెప్పుదును, దేవుడు ఆ సుంకరి ప్రార్థనను విని, తనను నీతిమంతుడని ప్రకటించాడు. అయితే ఆయన ఆ మత నాయకుని ప్రార్థనను ఇష్టపడలేదు. అహంకారముగలవానిని దేవుడు అణచివేయును, మరియు తగ్గించుకొనువానిని ఆయన హెచ్చించును.”

పదం సమాచారం:

  • Strong's: H1341, H1343, H1344, H1346, H1347, H1348, H1349, H1361, H1362, H1363, H1364, H1396, H1466, H1467, H1984, H2086, H2087, H2102, H2103, H2121, H3093, H3238, H3513, H4062, H1431, H4791, H5965, H7293, H7295, H7312, H7342, H7311, H7407, H7830, H8597, G212, G1391, G1392, G2744, G2745, G2746, G3173, G5187, G5229, G5243, G5244, G5308, G5309, G5426, G5450