te_tw/bible/other/joy.md

7.1 KiB

సంతోషం, సంతోషభరితం, ఆనందించు, హర్షించు

నిర్వచనం:

సంతోషం

"సంతోషం" పదం ఆనందాన్ని కలిగించే భావన లేదా లోతైన సంతృప్తిని సూచిస్తుంది. దీనికి సంబంధించిన "సంతోషభరితం" పదం చాలా ఆనందంతోనూ, సంపూర్ణ లోతైన సంతోషాన్ని అనుభవించే వ్యక్తిని వివరిస్తుంది.

  • ఒక వ్యక్తి తాను చాలా మంచిదానిని అనుభవించాననే లోతైన భావన కలిగినప్పుడు అతడు సంతోషాన్ని అనుభవిస్తాడు.
  • నిజమైన సంతోషాన్ని మనుషులకు ఇచ్చేది దేవుడు ఒక్కడే.
  • ఆనందం ఉండడం అనేది ఆహ్లాదకరమైన పరిస్థితిపై ఆధార పడి ఉండదు. మనుషులకు వారి జీవితాలలో గొప్ప కష్టాలు వచ్చినా దేవుడు వారికి ఆనందం ఇవ్వగలడు.
  • కొన్ని సార్లు ఇళ్ళు, పట్టణాలు మొదలైన వాటిని సంతోషభరితం అని వర్ణించబడ్డాయి. అంటే అక్కడ ఉండే ప్రజలు సంతోషంగా ఉన్నారు అని అర్థం.

ఆనందం

"ఆనందం" అంటే పూర్తి సంతోషం, ఉల్లాసంతో ఉండడం అని అర్థం.

  • ఈ పదం దేవుడు చేసిన మంచి కార్యములను గురించి చాలా సంతోషంగా ఉండడం అని తరచుగా సూచిస్తుంది.
  • ఈ పదం "చాలా సంతోషంగా ఉండడం" లేదా "చాలా ఉల్లాసంగా ఉండడం" లేదా "పూర్తి సంతోషంగా ఉండడం" అని అనువదించబడవచ్చు.
  • మరియ "నా ప్రాణం నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది," అన్నప్పుడు "నా రక్షకుడైన దేవుడు నన్ను సంతోషభరితంగా చేసాడు" లేదా "రక్షకుడైన దేవుడు నా కోసం చేసిన కారణంగా నేను చాలా సంతోషభరితంగా భావిస్తున్నాను" అని ఆమె భావన.

అనువాదం సూచనలు:

  • "సంతోషం" పదం "ఆహ్లాదం” లేదా “ఆనందం” లేదా “గొప్ప సంతోషం" అని అనువదించబడవచ్చు.
  • "సంతోషభరితం" పదబంధం "ఆనందం" లేదా "చాలా సంతోషంగా ఉండు" లేదా "దేవుని మంచితనంలో చాలా సంతోషంగా ఉండు" అని అనువదించబడవచ్చు.
  • సంతోషభరితంగా ఉన్న ఒక వ్యక్తి "చాలా సంతోషం" లేదా "చాలా ఆహ్లాదం" లేదా "లోతైన ఆనందం" అని వర్ణించబడవచ్చు.
  • "సంతోషభరితమైన కేకలు వేయు" లాంటి పదబంధం "నీవు చాలా సంతోషంగా ఉన్నావని చూపించే విధానంలో కేకలు వేయి" అని అనువదించబడవచ్చు.
  • "సంతోషభరితమైన పట్టణం” లేదా "సంతోషభరితమైన ఇల్లు" పదాలు "సంతోషభరితమైన ప్రజలు నివసించు పట్టణం" లేదా "సంతోషభరితులైన ప్రజలతో నిండిన ఇల్లు" లేదా “గొప్ప సంతోషంలో ఉన్న ప్రజలు నివసించే పట్టణం." (చూడండి: అన్యాపదేశం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 33:07 "రాతి నేలపై పడిన వ్యక్తి దేవుని మాట విని దానిని సంతోషం గాస్వీకరిస్తాడు."
  • 34:04 "దేవుని రాజ్యం పొలంలో ఒకడు పాతిపెట్టిన నిధి వంటిది. ఆ నిధిని కనుగొన్న మరొకడు దానిని మరలా పాతిపెట్టాడు. అతడు సంతోషం తో నిండిపోయాడు. పోయి తనకు ఉన్నవన్నీ అమ్మి వేశాడు. ఆ డబ్బుతో ఆ పొలం కొన్నాడు."
  • 41:07 స్త్రీలు భయంతోనూ సంతోషం తోనూ నిండిపోయారు. వారు పరిగెత్తుకుంటూ పోయి ఆ శుభవార్త శిష్యులకు చెప్పారు.

పదం సమాచారం:

  • Strong's: H1523, H1524, H1525, H1750, H2302, H2304, H2305, H2654, H2898, H4885, H5937, H5938, H5947, H5965, H5970, H6342, H6670, H7440, H7442, H7444, H7445, H7797, H7832, H8055, H8056, H8057, H8342, H8643, G20, G21, G2165, G2167, G2620, G2744, G2745, G3685, G4640, G4796, G4913, G5463, G5479