te_tw/bible/other/prosper.md

4.5 KiB

వర్ధిల్లు, సమృద్ధి, వర్ధిల్లుతున్న

నిర్వచనం:

“వృద్ధిల్లు” అనే పదం సాధారణముగా చక్మంకగా జీవించడాన్ని సూచిస్తుంది, భౌతికంగానూ, ఆత్మీయంగానూ వర్ధిల్లడాన్ని సూచిస్తుంది. ప్రజలుగానీ లేదా ఒక దేశముగానీ “వర్ధిల్లి"నప్పుడు వారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, విజయవంతంగా ఉండడానికి కావలసినవాటన్నిటినీ కలిగియున్నారని అర్థం. వారు “సమృద్ధి"ని అనుభవిస్తున్నారు.

  • “వర్ధిల్లుతున్న" పదం తరచుగా ధనమునూ, ఆస్తిపాస్తిలనూ కలిగియుండడానిని సూచిస్తుంది లేదా ప్రజలు చక్కగా జీవించడం కోసం కావలసిన ప్రతీదానిని తయారుచేసుకోవడానిని సూచిస్తుంది.
  • బైబిలులో “వర్ధిల్లుతున్న" పదంలో "మంచి ఆరోగ్యము," "పిల్లలతో ఆశీర్వదించబడడం" కూడా ఉన్నాయి.
  • “వర్ధిల్లుతున్న" పట్టణము లేక దేశము అంటే ఆ దేశము అనేకమంది ప్రజలను కలిగియుంది, మంచి ఆహార ఉత్పాదన ఉంది, ఎక్కువ రాబడిని తెచ్చే వ్యాపారాలు ఉన్నాయని అర్థం.
  • ఒక వ్యక్తి దేవుని బోధనలకు లోబడినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా వృద్ధి చెందుతాడని బైబిలు బోధిస్తుంది. అతడు సంతోష సమాధానముల ఆశీర్వాదములను కూడా అనుభవిస్తాడు. దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడు వస్తు సంబంధమైన సంపదను ఇవ్వడు, అయితే వారు ఆయన ఆజ్ఞలను అనుసరించే కొలది వారికి ఎల్లప్పుడూ ఆత్మీయంగా వృద్ధిని కలిగిస్తాడు. పరుస్తాడు.
  • సందర్భాన్ని బట్టి “వర్ధిల్లుతున్న" పదం “ఆత్మీయంగా విజయవంతం కావడం" లేదా " “దేవుని చేత ఆశీర్వదించబడడం" లేదా "మంచి సంగతులను అనుభవించడం" లేదా “మంచిగా జీవించడం” అని అనువదించబడ వచ్చు.
  • “వర్ధిల్లుతున్న" పదం "విజయవంతం” లేదా “సంపన్న” లేదా “ఆత్మీయంగా ఫలభరితం" అని అనువదించబడవచ్చు.
  • “సమృద్ధి” అనే పదం “క్షేమం" లేదా “సంపద” లేదా “విజయము” లేదా “సమృద్ధికరమైన ఆశీర్వాదములు” అని అనువదించబడవచ్చు.

(చూడండి: ఆశీర్వదించు, ఫలము, ఆత్మ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1129, H1767, H1878, H1879, H2428, H2896, H2898, H3027, H3190, H3444, H3498, H3787, H4195, H5381, H6500, H6509, H6555, H6743, H6744, H7230, H7487, H7919, H7951, H7961, H7963, H7965, G2137