te_tw/bible/other/pomegranate.md

2.5 KiB

దానిమ్మకాయ, దానిమ్మకాయలు

వాస్తవాలు:

దానిమ్మకాయ అనునది దప్పంగా ఉండే ఒక విధమైన పండు, ఈ పండులో తినగలిగే మెత్తని ఎర్రని పండును కలిగిన అనేకమైన విత్తనములతో నింపబడిన గట్టిగా ఉండే తోలును కలిగియుంటుంది.

  • బయటి బెరడు లేక తొక్క అనేది ఎర్రని రంగులో ఉంటుంది మరియు విత్తనముల చుట్టూ ఉండే పండు మెరుస్తూ ఎర్రగా ఉంటుంది.
  • దానిమ్మకాయలు ఐగుప్తు మరియు ఇశ్రాయేలులాంటి ఎక్కువ వేడివున్నటువంటి, పొడి వాతావరణం ఉన్నటువంటి దేశాలలో సర్వ సాధారణముగా పండుతుంటాయి.
  • కానాను పుష్కలమైన నీళ్ళు మరియు ఫలవంతమైన మన్ను ఉండే భూమియైయుండునని యెహోవ దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధానము చేసియుండెను. తద్వారా అక్కడ దానిమ్మకాయలతో సహా ఆహారము అపారముగా లభిస్తుంది.
  • సొలోమోను దేవాలయము నిర్మాణములో దానిమ్మకాయల ఆకారములో రాగి అలంకరణలు కూడా చేసిరి.

(ఈ పదములను కూడా చుడండి: రాగి, కానాను, ఐగుప్తు, సొలోమోను, దేవాలయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7416