te_tw/bible/other/palm.md

2.4 KiB

ఖర్జూరపు మట్ట, ఖర్జూరపు మట్టలు

నిర్వచనం:

“ఖర్జూరపు మట్ట” అనే మాట ఎక్కువ పొడువుగా ఉండి, అనువైన రీతిలో చెట్టు తుది భాగములోనుండి విస్తరించియున్న ఫంకాలాగా ఉండే ఆకుకొమ్మలను కలిగియుండె ఒక విధమైన చెట్టు.

  • పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఖర్జూరపు చెట్టు సహజముగా “ఖర్జూరం” అని పిలువబడే పళ్ళను కాసే ఒక విధమైన ఖర్జూరపు చెట్టును సూచించును. ఈ చెట్టు ఆకులు ఈకల నమూనను కలిగియుంటుంది.
  • ఖర్జూరపు చెట్లు సహజముగా వేడిగాను, తేమతో కూడిన వాతావరణములో ఎక్కువగా పెరుగుతాయి. వాటి ఆకులు సంవత్సరమంతా పచ్చగానే ఉంటాయి.
  • యేసు గాడిద మిద ఎక్కి యెరూసలేములోనికి ప్రవేశించినప్పుడు, జనులందరూ ఆయన వస్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలను నేల మీద పరిచిరి.
  • ఖర్జూరపు మట్టలు సమాధానమునకు మరియు జయకేతనమునకు సూచనప్రాయంగా ఉంటాయి.

(ఈ పదాలను కూడా చూడండి: గాడిద, యెరూసలెం, సమాధానము)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H3712, H8558, H8560, H8561, G5404