te_tw/bible/other/family.md

2.4 KiB

కుటుంబం, కుటుంబాలు

నిర్వచనం:

"కుటుంబం" అంటే రక్తసంబంధం ఉన్న వారు, సాధారణంగా తండ్రి, తల్లి, వారి పిల్లలు. ఇందులో తాతలు, మనవలు మేనమామలు, పిన తల్లులు మొదలైన ఇతర బంధువులు కూడా ఉంటారు.

  • హీబ్రూ కుటుంబం ఒక మత సమాజం. ఆరాధన, ఉపదేశం ద్వారా మత సంప్రదాయాలను నేర్పించే వ్యవస్థ.
  • సాధారణంగా తండ్రి కి కుటుంబంపై అధికారం ఉంటుంది.
  • కుటుంబం లో సేవకులు, ఉంపుడుగత్తెలు, విదేశీయులు సైతం ఉంటారు.
  • కొన్ని భాషలలో మరింత స్థూలమైన "తెగ” లేక “ఇంటి వారు" వంటి పదాలు ఉండవచ్చు. కేవలం తల్లిదండ్రులు, పిల్లలు కాకుండా ఎక్కువ మంది ఉండే సందర్భాలను ఇది సూచిస్తుంది .
  • "కుటుంబం" అనే దాన్ని ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉన్న మనుషులకు కూడా ఉపయోగిస్తారు. అలాటి వారు దేవుని కుటుంబంలో భాగం. ఎందుకంటే వారు యేసును విశ్వసించారు.

(చూడండి: తెగ, పూర్వీకుడు, ఇల్లు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1, H251, H272, H504, H1004, H1121, H2233, H2859, H2945, H3187, H4138, H4940, H5387, H5712, G1085, G3614, G3624, G3965