te_tw/bible/other/eagle.md

2.2 KiB

గరుడ పక్షి, గరుడ పక్షులు

నిర్వచనం:

గరుడ పక్షి చాలా పెద్ద, శక్తివంతమైన పక్షి. ఇది చేపలు, ఎలుకలు , పాములు, కోళ్ళు వంటి చిన్న జంతువులను వేటాడుతుంది.

  • బైబిల్ ఒక సైన్యానికి ఉండే బలాన్ని వడిగా హటాత్తుగా దూసుకు వచ్చి తన ఎరను తన్నుకుపోయే గరుడ పక్షి తో పోలుస్తున్నది.
  • యెషయా ప్రభువుపై నమ్మకముంచే వారిని ఆకాశంలో ఎగిరిపోయే గరుడ పక్షితో పోల్చాడు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయనకు లోబడే వారి స్వేచ్ఛను, బలాన్ని వర్ణించడానికి అలంకారికంగా ఈభాష ఉపయోగిస్తారు.
  • దానియేలు గ్రంథంలో నెబుకద్నేజర్ జుట్టును పొడవైన గరుడ పక్షి ఈకలతో పోల్చారు. అవి 50 సెంటిమీటర్లకన్నా పొడవు ఉండవచ్చు.

(చూడండి: దానియేలు, స్వేచ్ఛ, నెబుకద్నేజర్, శక్తి)

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5403, H5404, H7360, G105