4.0 KiB
4.0 KiB
దహించు, దహించు, దహించిన, దహించే
నిర్వచనం:
ఈ పదం "దహించు" అనే దానికి అక్షరాలా అర్థం దేన్నైనా పూర్తిగా వాడుకోవడం. దీనికి అనేక అలంకారికంగా అర్థాలు ఉన్నాయి.
- బైబిల్లో, ఈ పదం "దహించు" అనే పదం తరచుగా వస్తువులు మనుషులు నాశనం కావడం సూచిస్తున్నది
- అగ్నివస్తువులను దహించి వేస్తుంది. అంటే తగలబెట్టి నాశనం చేస్తుంది.
- దేవుణ్ణి "దహించే మంట," గా అభివర్ణించడం చూస్తున్నాము. పాపానికి వ్యతిరేకంగాతన కోపానికి ఇది వర్ణన. ఆయన కోపం పశ్చాత్తాప పడు పాపులను శిక్షిస్తూ ఉంది.
- ఆహారాన్ని ఆరగించడానికి కూడా ఈ మాట వాడతారు.
- పద బంధం, "దేశాన్ని దహించడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"దేశాన్నినాశనం చేయడం."
అనువాదం సలహాలు
- దేశం, లేక ప్రజలను దహించివేయడం, అనే సందర్భంలో ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "నాశనం."
- మంట అనే అర్థం వచ్చినప్పుడు "దహించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు, "కాల్చి వేయు."
- తగలబడిపోతున్న పొద "దహించుకు పోవడం" లేదు అని మోషే చూసిన సందర్భంలో ఇలా అనువదించ వచ్చు, "పూర్తిగా కాలిపోవడం లేదు” లేక “అది తగలబడి పోవడం లేదు."
- తినడం అనే అర్థం ఇచ్చే సందర్భంలో "దహించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అరగించు” లేక “దిగమింగు."
- ఎవరి బలమైనా "దహించుకు పోతుంది," అంటే తన బలం "హరించుకుపోయింది” లేక “పోయింది."
- "దేవుడు దహించే మంట" అనే మాటను ఇలా అనువదించ వచ్చు, "దేవుడు అన్నిటినీ కాల్చి వేసే మంట” లేక “దేవుడు పాపానికి వ్యతిరేకంగా కోపపడి నాశనం పాపులను మంటలాగా కాల్చి వేస్తాడు."
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H398, H402, H1086, H1104, H1197, H1497, H1846, H2000, H2628, H3615, H3617, H3631, H3857, H4127, H4529, H4743, H5486, H5487, H5595, H6244, H6789, H7332, H7646, H7829, H8046, H8552, G355, G1159, G2618, G2654, G2719, G5315, G5723