te_tw/bible/kt/wrath.md

3.1 KiB

ఉగ్రత, ఆగ్రహము

నిర్వచనము:

ఉగ్రత అనేది కొన్నిమార్లు దీర్ఘకాలము ఉండే అతి తీవ్రమైన కోపము అని అర్థము.

  • ఇది విశేషముగా పాప విషయమై దేవుని నీతియుతమైన తీర్పును మరియు దేవునికి తిరుగబడిన ప్రతియొక్కరికి ఇచ్చే శిక్షను కూడా సూచిస్తుంది.
  • పరిశుద్ధ గ్రంథములో “ఉగ్రత” అనేది సహజముగా దేవునికి విరుద్ధముగా పాపము చేసినవారిపైన ఆయన చూపించే కోపమును సూచిస్తుంది.
  • “దేవుని ఉగ్రత” అనేది కూడా ఆయన తీర్పును మరియు పాపము కొరకైన శిక్షను సూచిస్తుంది.
  • దేవుని ఉగ్రత అనేది పాపముల విషయమై పశ్చాత్తాప పడకుండా ఉండేవారికొరకు నీతియుతమైన దండనయైయున్నది.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములలో “తీవ్రమైన కోపము” లేక “నీతియుతమైన తీర్పు” లేక “కోపము” అనే పదాలను కూడా ఉపయోగించుదురు.
  • దేవుని ఉగ్రతను గూర్చి మాట్లాడునప్పుడు, ఈ పదమును తర్జుమా చేయుటకు ఉపయోగించిన పదము లేక వాక్యములు పట్టలేని కోపమును సూచించకుండ జాగ్రత్తపడండి. దేవుని ఉగ్రత న్యాయమైనది మరియు పవిత్రమైనది.

(ఈ పదాలను కూడా చూడండి: తీర్పు చేయుట, పాపము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H639, H2197, H2528, H2534, H2740, H3707, H3708, H5678, H7107, H7109, H7110, H7265, H7267, G2372, G3709, G3949, G3950