te_tw/bible/other/confirm.md

2.7 KiB

నిర్ధారించు, నిర్ధారణలు, నిర్ధారించిన, నిర్ధారణ

నిర్వచనం:

పదాలు "నిర్ధారించు” “నిర్ధారణ" అనే పదాలు ఖాయంగా చెప్పడం, ఏదైనా నమ్మదగినది అని, నిజమనీ భరోసాగా చెప్పడం.

  • పాత నిబంధనలో, దేవుడు తన ప్రజలతో తాను తన నిబంధనను "నిర్ధారించానని" చెప్పాడు. అంటే అయన తన ఆ నిబంధన వాగ్దానం నిలుపుకుంటాడు.
  • ఒక రాజు "నిర్ధారించ బడ్డాడు" అంటే అతన్ని రాజుగా చెయ్యాలన్న నిర్ణయం జరిగిపోయి ప్రజలు దానికి సమ్మతించారు అని అర్థం.
  • ఎవరైనా రాసిన దాన్ని నిర్ధారించడం అంటే అది నిజమని ప్రకటించడం.
  • సువార్త "నిర్ధారణ" అంటే యేసు సువార్తను అది నిజమని చూపే పధ్ధతి.
  • శపథం చెయ్యడమంటే "నిర్ధారించడం" అంటే గంభీరంగా దేన్నైనా అది నిజమని, నమ్మదగినది అని ప్రకటించడం.
  • "నిర్ధారించు" అనే దానిలో, "ఒక సంగతి నిజం అని నమ్మకంగా చెప్పడం” లేక “నమ్మదగినది అని రుజువుగా చెప్పడం” లేక “సమ్మతించడం” లేక “నిశ్చయత కలిగి ఉండడం” లేక “వాగ్దానం," అనే అర్థాలు సందర్భాన్ని బట్టి ఉన్నాయి.

(చూడండి: నిబంధన, శపథం, నమ్మకముంచు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H553, H559, H1396, H3045, H3559, H4390, H4672, H5414, H5975, H6213, H6965, G950, G951, G1991, G2964, G3315, G4300, G4972