te_tw/bible/other/oath.md

5.1 KiB

శపథం, శపథాలు, ప్రమాణం(ఒట్టు), ప్రమాణాలు, ఒట్టుపెట్టుకోవడం, చేత ప్రమాణం, చేత ప్రమాణాలు

నిర్వచనం

బైబిలులో శపథం అంటే ఏదైనా చెయ్యడానికి ఇచ్చే క్రమబద్దమైన వాగ్దానం. శపథం చేసే వ్యక్తి తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సి ఉంది. శపథంలో నమ్మకంగా, యదార్ధంగా ఉండడానికి సమర్పణ ఉంది.

  • న్యాయ సభలో, ఒక సాక్షి తరుచుగా తాను చెప్పే ప్రతీది సత్యమైనదిగానూ, వాస్తవమైనదిగానూ ఉంటుందని వాగ్దానం ఇవ్వడానికి ప్రమాణం చేస్తాడు.
  • బైబిలులో “ప్రమాణం” అంటే ఒక శపధం చెప్పడమే.
  • ”చేత ప్రమాణం” అంటే, ఒక వస్తువునైనా లేదా ఒక వ్యక్తినైనా ఆధారంగా లేక శక్తిగా తీసుకొని శపథం చెయ్యడం.
  • కొన్నిసార్లు ఈ పదాలను కలిపి “శాపధాన్ని ప్రమాణం చెయ్యి” అని వినియోగిస్తారు.
  • అబ్రాహాము, అబిమెలేకు ఒక బావిని ఉపయోగించడం గురించి కలిసి ఓక నిబంధన చేసేటప్పుడు ఒక శాపధాన్ని ప్రమాణం చేసారు,
  • ఇస్సాకుకు భార్యను వెదకడానికి తన బంధువుల మధ్య నుండే చూడాలని అబ్రహాము తన సేవకుడిని శపథం (లాంఛనంగా ‘వాగ్దానం’) చెయ్యమని చెప్పాడు.
  • దేవుడు కూడా శపధాలు చేసాడు, వాటిలో తన ప్రజలకు వాగ్దానాలను చేసాడు.
  • ఆధునిక కాలంలో “శపథం” అంటే “మాలిన బాషను వినియోగించడం.” బైబిల్లో దీని అర్థం ఇది కాదు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “ఒక శపధం” అనే పదం “ఒక ప్రతిజ్ఞ” లేక “ఒక గంభీరమైన వాగ్దానం” అని అనువదించవచ్చు.
  • ”ప్రమాణం” అనే పదాన్ని “లాంచనప్రాయంగా వాగ్దానం” లేక “ప్రతిజ్ఞ” లేక “ఏదైనా చెయ్యడానికి సమర్పణ” అని అనువాదం చెయ్యవచ్చు. “నా నామంలో ప్రమాణం చెయ్యడం” అనే మాటని “స్థిరపరచడానికి నా పేరును వినియోగిస్తూ ఒక వాగ్దానం చెయ్యడం” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”ఆకాశం, భూమి పేరున ప్రమాణం” అనే మాటను “ఏదైనా చెయ్యడానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఆకాశం, భూమి స్థిరపరుస్తున్నాయి అని చెప్పడం” అని అనువదించవచ్చు.
  • ”ప్రమాణం” లేక “శపథం” పదములు అర్థం శపించడం అనే అర్థం ఇచ్చేలా ఉండకుండా చూసుకోవాలి. బైబిలులో అటువంటి అర్థం లేదు.

(చూడండి: అబిమెలెక్, నిబంధన, వాగ్దానం)

బైబిలు రిఫరెన్సులు

పదం సమాచారం:

  • Strong's: H422, H423, H3027, H5375, H7621, H7650, G332, G3660, G3727, G3728