te_tw/bible/other/bloodshed.md

3.5 KiB

రక్తం చిందించు

నిర్వచనం:

ఈ పదం "రక్తం చిందించు" అనేది హత్య, యుద్ధం , లేక ఇతర హింసాకాండ మూలంగా మనుషులు మరణం కావడాన్ని సూచిస్తున్నది.

  • అక్షరాలా దీని అర్థం. "రక్తం స్రవించు. "వ్యక్తి శరీరంపై గాయం వలన రక్తం కారడాన్ని ఇది సూచిస్తున్నది.
  • ఈ పదం "రక్తం చిందించు"ను తరచుగా అనేక మందిని హతమార్చిన సందర్భంలో ఉపయోగిస్తారు.
  • దీన్ని హత్య పాపం గురించి చెప్పడానికి సాధారణంగా ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • "రక్తం చిందించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మనుషులను హతమార్చడం’ లేక “హతమైన అనేక మంది ప్రజలు."
  • "రక్తం చిందించడం ద్వారా"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. అంటే "మనుషులను చంపడం ద్వారా."
  • "నిర్దోష రక్తం చిందించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిర్దోష ప్రజలను చంపడం."
  • "రక్తం చిందించడం వెంట రక్తం చిందించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"వారు ప్రజలను అదేపనిగా ఊచకోత కోశారు.” లేక “ప్రజల మారణహోమం కొనసాగింది.” లేక “వారు అనేక మంది ప్రజలను హతమార్చడం కొనసాగించారు.” లేక “ప్రజలు ఇతర ప్రజలను చంపుతూ పోయారు."
  • మరొక అలంకారిక ప్రయోగం, "చిందించిన రక్తం నిన్ను వెంబడిస్తుంది"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నీ ప్రజలకు రక్తం చిందే చేటు కొనసాగుతుంది.” లేక “నీ ప్రజలు మారణహోమానికి గురి అవుతూనే ఉంటారు.” లేక “నీ ప్రజలు ఇతర జాతులతో యుద్ధాల్లో నిమగ్నమై మరణిస్తూ ఉంటారు."

(చూడండి: రక్తం, వధ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1818, G2210