te_tw/bible/kt/blood.md

5.9 KiB

రక్తం

నిర్వచనం:

"రక్తం" ఎరుపు ద్రవం. మనిషి గాయపడితే అతని చర్మం గుండా బయటకు వస్తుంది. రక్తం వ్యక్తి మొత్తం శరీరానికి రక్తం జీవాధారమైన పోషకాలను అందిస్తుంది.

  • రక్తం జీవానికి సంకేతం. రక్తం చిందించినప్పుడు జీవాన్ని కోల్పోవడం లేక మరణం పొందడం జరుగుతుంది.
  • ప్రజలు దేవునికి బలి అర్పణలు చేసినప్పుడు వారు ఒక జంతువును వధించి దాని రక్తాన్ని బలిపీఠంపై పోసే వారు. ఆ జంతువు జీవం బలి అర్పణ అయిపోయింది అనే దానికి ఇది సంకేతం. మనుషుల పాపాలకు ఈ విధంగా వెల చెల్లించడం జరుగుతుంది.
  • సిలువపై తన మరణం ద్వారా యేసు రక్తం సంకేత రూపంగా ప్రజలను వారి పాపాల నుండి శుద్ధి చెయ్యడానికి తమ పాపాలకై వారు పొందవలసిన శిక్ష తప్పించడానికి మార్గం సిద్ధపరిచాడు.
  • "రక్తమాంసాలు" అనే మాట మానవులను సూచిస్తున్నది.
  • "స్వంత రక్తమాంసాలు" అనే మాట శారీరికంగా బంధుత్వం ఉన్న మనుషులను సూచిస్తున్నది.

అనువాదం సలహాలు:

  • లక్ష్య భాషలో రక్తం అనేదాన్ని చెప్పడానికి ఉపయోగించే పదం ఉపయోగించి ఈ పదాన్ని తర్జుమా చెయ్య వచ్చు
  • "రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలు” లేక “మానవులు."
  • సందర్భాన్ని బట్టి, "నా స్వంత రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నా స్వంత కుటుంబం” లేక “నా స్వంత బంధువులు” లేక “నా స్వంత ప్రజలు."
  • లక్ష్య భాష లో ఈ అర్థం ఇచ్చే పదం ఉంటే "రక్తమాంసాలు" అనే పదాన్ని ఆ మాట ఉపయోగించి అనువదించవచ్చు.

(చూడండి: శరీరం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:03 యోసేపు సోదరులు ఇంటికి తిరిగి వెళ్ళక ముందు వారు యోసేపు అంగీని చింపి దాన్ని మేక రక్తం లో ముంచారు.
  • 10:03 దేవుడు నైలు నదీజలాలను రక్తంగా మార్చాడు, అయితే ఫరో ఇంకా ఇశ్రాయేలీయులను వెళ్ళనియ్యలేదు.
  • 11:05 ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళ తలుపులపై రక్తం పూశారు. కాబట్టి అందరు లోపల ఉండగా దేవుడు ఆ ఇళ్ళు దాటిపోయాడు. గొర్రె పిల్ల రక్తం మూలంగా వారు భద్రంగా ఉన్నారు.
  • 13:09 బలి అర్పణ చేసిన జంతువు రక్తం ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేసి అతన్ని దేవుని దృష్టిలో పరిశుభ్రం చేస్తుంది.
  • 38:05 తరువాత యేసు ఒక పాత్ర తీసుకుని ఇలా చెప్పాడు, "దీన్ని తాగండి. ఇది నా రక్తం పాపాల క్షమాపణ కోసం చిందించిన రక్తం మూలంగా అయిన కొత్త నిబంధన.
  • 48:10 ఎవరైనా యేసు, రక్తం పై విశ్వాసం ఉంచితే ఆయన ఆ మనిషి వ్యక్తి పాపం తీసి వేస్తాడు. దేవుని శిక్ష అతన్ని దాటిపోతుంది.

పదం సమాచారం:

  • Strong's: H1818, H5332, G129, G130, G131, G1420