te_tw/bible/other/amazed.md

3.0 KiB

ఆశ్చర్యపోవు, ఆశ్చర్యం, నివ్వెరపోవు, మ్రాన్పడు, అబ్బురపడు, ఆశ్చర్యం, అద్భుతం, అద్భుతమైన, అద్భుతాలు

నిర్వచనం:

ఒక అసాధారణమైన విషయం జరగడం మూలంగా చాలా ఆశ్చర్య పోవడాన్ని ఈ పదాలన్నీ సూచిస్తున్నాయి.

  • వీటిలో కొన్ని మాటలు అనువాదాలు. "ఆశ్చర్యంతో కొయ్యబారి పోవడం” లేక “తన కళ్ళు తానే నమ్మలేక పోవడం"అని అర్థమిచ్చే గ్రీకు పదాల అనువాదాలు. ఒక వ్యక్తి ఎంత ఆశ్చర్యంగా అబ్బురంగా ఉన్నాడో ఈ పదాలు వర్ణిస్తున్నాయి. ఇతర భాషల్లో దీనిని వ్యక్త పరిచే మాటలు ఉండవచ్చు.
  • సాధారణంగా ఆశ్చర్యం కలిగించే సంఘటన ఏదైనా ఒక అద్భుతం, అది దేవుడు మాత్రమే చేసేది.
  • ఈ పదాలు ఎదో ఊహించరానిది జరిగినప్పుడు కలిగే గందరగోళం అనే అర్థం కూడా ఇస్తాయి.
  • ఈ మాటలు అనువదించడానికి ఇతర మార్గాలు "పూర్తిగా ఆశ్చర్య పోవు” లేక “స్తంభించి పోవు."
  • దీనికి సంబంధించిన మాటలు, "అద్భుతం" (అబ్బురం, అద్భుతమైన), "ఆశ్చర్యం,” “స్థాణువై పోవు."
  • సాధారణంగా, ఈ పదాలు సకారాత్మకమైనవై, జరిగిన దాన్ని బట్టి మనుషులు ఆనందించేవై ఉంటాయి.

(చూడండి: అద్భుతం, సూచన)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H926, H2865, H3820, H4159, H4923, H5953, H6313, H6381, H6382, H6383, H6395, H7583, H8047, H8074, H8078, H8429, H8539, H8540, H8541, H8653, G639, G1568, G1569, G1605, G1611, G1839, G2284, G2285, G2296, G2297, G2298, G3167, G4023, G4423, G4592, G5059