te_tw/bible/other/alarm.md

2.7 KiB

కంగారు, కంగారుగా, కంగారుపడు

వాస్తవాలు:

కంగారు అంటే తనకు హాని జరగవచ్చని ఒక మనిషిలో కలిగే హెచ్చరిక ఆలోచన. "కంగారు పడడం"అంటే ఎదో ఆపద, ముప్పు వాటిల్లనున్నదని అందోళన, భయంతో సతమతం కావడం.

  • మోయాబీయులు యూదా రాజ్యంపై దాడి చేస్తారని విన్నప్పుడు యెహోషాపాతు రాజు కంగారు పడ్డాడు.
  • అంత్య దినాల్లో వాటిల్లనున్న అరిష్టాల గురించి విన్నప్పుడు కంగారు పడవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు.
  • "హెచ్చరిక ధ్వని చెయ్యడం" అంటే హెచ్చరించడం. ప్రాచీన కాలంలో, ఒక వ్యక్తి ఏదైనా శబ్దం చేయడం ద్వారా ఇతరులను హెచ్చరించే వాడు.

అనువాదం సలహాలు

  • "ఎవరినైనా కంగారు పెట్టడం"అంటే "అందోళనకు గురి చెయ్యడం"లేక "కలవరపరచడం."
  • "కంగారు పడడం"అనే మాటను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అందోళన చెందడం” లేక “భయపడడం” లేక “చాలా తీవ్రంగా ఆలోచించడం."
  • “హెచ్చరిక ధ్వని చెయ్యడం” అనే మాటను ఇలా అనువదించవచ్చు "బహిరంగంగా హెచ్చరించు” లేక “ప్రమాదం ముంచుకు వస్తున్నదని ప్రకటించడం” లేక “ప్రమాదం గురించి తెలియజేయడానికి బాకా ఊదడం."

(చూడండి: యెహోషాపాతు, మోయాబు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7321, H8643