te_tw/bible/names/pontus.md

2.1 KiB

పొంతు

వాస్తవాలు:

పొంతు అనునది ఆదిమ సంఘ కాలములో మరియు రోమా సామ్రాజ్యపు కాలములో రోమా ప్రాంతమైయుండెను. ఇది నల్ల సముద్రపు దక్షిణ తీరమునందు మరియు ఇప్పటి దేశమైన టర్కీ దేశపు ఉత్తర భాగమందు కనబడుతుంది.

  • అపొస్తలుల కార్యముల గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, పెంతకొస్తు దినమున అపొస్తలుల మీదకి మొట్ట మొదటిగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చినప్పుడు పొంతు ప్రాంతమునుండి వచ్చిన ప్రజలందరూ యెరూషలేములో ఉండిరి.
  • అకుల అనే విశ్వాసి పొంతు ప్రాంతమునకు చెందినవాడు.
  • అనేక ప్రాంతములకు చెదరిన క్రైస్తవులకు పేతురు తన పత్రికలను వ్రాసినప్పుడు, ఆ ప్రాంతములలో పొంతు అనునది ఒక ప్రాంతమని వ్రాసియుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: అకుల, పెంతకొస్తు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4193, G4195