te_tw/bible/names/lystra.md

2.3 KiB

లుస్త్ర

వాస్తవాలు:

పురాతన ఆసియా మైనరులో లుస్త్ర ఒక పట్టణం. పౌలు తాను చేసిన ఒక పరిచర్య యాత్రలో ఈ పట్టణాన్ని దర్శించాడు. లుకోనియ ప్రాంతంలో ఈ పట్టణం ఉంది, ఇది ప్రస్తుతం ఆధునిక టర్కీ దేశం.

  • ఈకొనియలో యూదులు బెదిరించినప్పుడు పౌలునూ, అతని సహచారులునూ దేర్బే, లుస్త్ర పట్టణాలకు తప్పించుకొన్నారు.
  • లుస్త్ర పట్టణంలో పౌలు తిమోతిని కలుసుకొన్నాడు, తరువాత తిమోతి పౌలు సహచారుడయ్యాడు, సంఘ స్థాపకుడు అయ్యాడు.
  • లుస్త్రలో కుంటికాలు కలవాడిని పౌలు బాగు చేసిన తరువాత ప్రజలు పౌలునూ, బర్నబాను ఆరాధించడానికి ప్రయత్నించారు, అయితే అపోస్తలులు వారిని గద్దించారు, తమ్మును ఆరాధించకుండా వారిని అడ్డగించారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: సువార్తికుడు, ఈకొనియా, తిమోతి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G3082