te_tw/bible/names/luke.md

2.0 KiB

లూకా

వాస్తవాలు:

లూకా కొత్తనిబంధనలో రెండు పుస్తకాలను రాసాడు: లూకా సువార్త, అపొస్తలుల కార్యముల గ్రంథం.

  • కొలస్సీ పత్రికలో లూకా ఒక వైద్యుడని పౌలు ప్రస్తావించాడు. తాను రాసిన మరొక రెండు పత్రికలలో లూకాను గురించి పౌలు రాసాడు.
  • లూకా గ్రీసు దేశస్థుడు, అన్యుడు, క్రీస్తు వద్దకు వచ్చాడు. తన సువార్తలో మనుష్యులందరికోసం అనగా యూదులు, అన్యజనుల కోసం యేసు ప్రేమను అధికంగా చూపిస్తూ అనేక సంఘటనలను గురించి రాసాడు.
  • పౌలు చేసిన రెండు మిషనరీ ప్రయాణాలలో పౌలుతో పాటు లూకా జతగా ఉన్నాడు, పౌలు పనిలో సహాయం చేసాడు.
  • ఆదిమ రచనలు కొన్నింటిలో లూకా సిరియాలోని అంతియొకయ పట్టణంలో పుట్టాడని ఉంది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అంతియొకయ, పౌలు, సిరియా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం: