te_tw/bible/names/galatia.md

2.3 KiB

గలతియ, గలతి

వాస్తవాలు:

కొత్త నిబంధన కాలంలో, గలతియ పెద్ద రోమా పరగణా. ఇది ప్రస్తుత టర్కీ దేశంలో ఉంది.

  • గలతియలో ఒక భాగం నల్ల సముద్రం ఉత్తర అంచున ఉంది. ఇది ఆసియా, బితూనియ, కప్పదొకియా, కిలికియా, పంఫులియా పరగణాలు సరిహద్దులుగా ఉంది.
  • అపోస్తలుడు పౌలు గలతియ పరగణాలో నివసించే క్రైస్తవులకు ఒక ఉత్తరం రాశాడు. అది కొత్త నిబంధన పుస్తకం "గలతి పత్రిక."
  • పౌలు ఈ గలతీ వారికీ ఈ ఉత్తరం కృప ద్వారా తప్ప మంచి పనుల ద్వారా రక్షణ రాదని నొక్కి చెప్పడానికి రాశాడు.
  • యూదు క్రైస్తవులు పొరపాటుగా యూదేతర క్రైస్తవులు విశ్వాసులుగా ఉండాలంటే కొన్ని యూదు చట్టాలు పాటించాలని నమ్ముతున్నారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆసియా, విశ్వసించు, కిలికియ, మంచి వార్త, పౌలు, పనులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1053, G1054