te_tw/bible/names/edom.md

2.8 KiB

ఎదోము, ఎదోమీయుడు, ఎదోమీయులు, ఇదుమియా

వాస్తవాలు:

ఎదోము అనేది ఏశావుకు మరొకపేరు. అతడు నివసించిన ప్రాంతానికి "ఎదోము" అనీ, అటు తరువాత, "ఇదుమియా" అనీ పేరు వచ్చింది. "ఎదోమీయులు" అతని సంతానం.

  • ఎదోము ప్రాంతం ఉనికి మారుతూ వచ్చింది. మొత్తం మీద ఇశ్రాయేలుకు దక్షిణాన, ఎట్టకేలకు దక్షిణ యూదాకు వ్యాపించింది.
  • కొత్త నిబంధన సమయాల్లో ఎదోము యూదా పరగణా దక్షిణ భాగంలో ఉంది. గ్రీకులు దీన్ని "ఇదుమియా" అని పిలిచారు.
  • "ఎదోము" అంటే "ఎరుపు," బహుశా ఇది పుట్టుకతోనే ఏశావు శరీరంపై ఉన్న ఎర్రని వెంట్రుకల మూలంగా వచ్చి ఉండవచ్చు. లేదా ఏశావు తన జన్మ హక్కు ను అమ్ముకుని తిన్న ఎర్రని చిక్కుడు కూర మూలంగా వచ్చి ఉండవచ్చు.
  • పాత నిబంధనలో ఎదోము దేశాన్ని తరచుగా ప్రస్తావించినది ఇశ్రాయేలుకు శత్రు దేశంగా.
  • ఓబద్యా మొత్తం పుస్తకం ఎదోము నాశనం గురించే. ఇతర పాత నిబంధన ప్రవక్తలు ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనాలు పలికారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ప్రత్యర్థి, జన్మ హక్కు, ఏశావు, ఓబద్యా, ప్రవక్త)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H123, H130, H8165, G2401